
వివిధ రకాల ఆహార పదార్థాలను ఉపయోగించి తయారు చేసే శాండ్విచ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా శాండ్విచ్లను లోట్టలు వేసుకుని తింటుంటారు. తాజాగా గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన శాండ్విచ్.. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు Omar Abdullaను ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన ఒమర్.. `ఈ శాండ్విచ్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. దీనిని ఎలా కనుగొన్నారు? నేను గుజరాతీ వంటకాలను ఇష్టపడతాను. కానీ, ఈ ఆవిష్కరణ అద్భుతం` అని ఒమర్ పేర్కొన్నారు.
ఆ శాండ్విచ్ను ఎలా తయారు చేశారంటే?
ముందుగా రెండు బ్రెడ్ ముక్కలను లవ్ సింబల్ షేప్‌లో కట్ చేశారు. దానిపై వివిధ రకాల క్రీములను రాశారు. ఆ తర్వాత డెయిరీ మిల్క్ కంపెనీ చాక్లెట్లను తీసుకుని వాటిని పొడిగా చేశారు. ఆ పొడిని ఓ బ్రెడ్ ముక్కపై వేశారు. దానిపై ఛీజ్ పెట్టి ముక్కలుగా కట్ చేసిన రెండు ఐస్ క్రీమ్‌లను దానిపై పెట్టారు. మరో బ్రెడ్ ముక్కను దానిపై పెట్టారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి