నిషేధం అన్ని మతాలపై ఉంటే బాగుండేది: ఒమర్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2021-12-12T23:15:29+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు..

నిషేధం అన్ని మతాలపై ఉంటే బాగుండేది: ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ప్రత్యేకంగా ఒక మతాన్ని, మతస్తులను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని, బహిరంగ ప్రార్థనలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటే అన్ని మతాల ప్రార్థనలపై నిషేధం విధించాలని అన్నారు. ‘‘ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు అన్ని మతాలపై ఆంక్షలు విధించాలి. కానీ బీజేపీ పాలసీ అది కాదు. కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని నిషేధాలు, ఆంక్షలు విధిస్తారు. పూజలు చేస్తే లేని ఇబ్బంది నమాజ్ చేస్తే ఎలా వచ్చింది? మతం ఆధారంగా రాజకీయాలు చేయడం బీజేపీ మానుకోవాలి’’ అని ఒమర్ అబ్దుల్లా హితవు పలికారు.

Updated Date - 2021-12-12T23:15:29+05:30 IST