కేరళ గవర్నర్‌కు థాంక్స్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా

Published: Mon, 28 Mar 2022 16:30:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేరళ గవర్నర్‌కు థాంక్స్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: మాజీ కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురు రుబయ్యా సయీద్‌ను కిడ్నాప్ చేసి తమ వాళ్లను విడుదల చేయాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఫారూఖ్ అబ్దుల్లా అందుకు ఒప్పుకోలేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. కాగా, ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసినందుకు కేరళ గవర్నర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 1989లో జరిగిన ఈ ఉదంతం గురించి తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ స్పష్టం చేశారు.

1989 డిసెంబర్ 9న రుబయ్యా సయీద్‌ను జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా, అరెస్టై జైలులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఫారూఖ్ అబ్దుల్లా అందుకు ఒప్పుకోలేదట. అయితే చాలా ఒత్తిడిల అనంతరం వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో రుబయ్యను తమ చెర నుంచి ఉగ్రవాదులు విడుదల చేశారు.

‘‘వాస్తవాలు మాట్లాడుకోవాలి. జైలులో ఉన్న టెర్రరిస్టులను విడుదల చేయడానికి ఫారూఖ్ అబ్దుల్లా ఒప్పుకోలేదు. నేను వెంటనే ఆయనకు చెప్పాను. ‘ఫారూఖ్ సాహెబ్.. నేను మీకు మద్దతుగా ఉంటాను. ఇది ఎంతటి వరకు వెళ్లినా సరే.. అంత వరకు నేను మీతోనే నడుస్తాను’’ అని ఒక ఇంటర్వ్యలో గవర్నర్ ఖాన్ చెప్పారు. ఈ వీడియో క్లిప్‌ను ఒమర్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘‘బీజేపీ మద్దతు ఉన్న అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం కొనసాగుతున్న 1989 డిసెంబర్‌లో ఏం జరిగిందో సూటిగా, స్పష్టంగా ఆరిఫ్ మహ్మదర్ ఖాన్ సాహెబ్ చెప్పారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఎన్ని అపోహలు సృష్టించినా వాస్తవాలు ఎప్పటికీ వాస్తవాలే’’ అని రాసుకొచ్చారు. చివర్లో ‘‘కేరళ గవర్నర్‌కు ధన్యవాదాలు’’ అని ఒమర్ పేర్కొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.