Omicronపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల కొత్త హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-02T17:40:57+05:30 IST

కొవిడ్-19 కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ పై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తాజాగా కొత్త హెచ్చరిక జారీ చేశారు....

Omicronపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల కొత్త హెచ్చరిక

కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా): కొవిడ్-19 కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ పై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తాజాగా కొత్త హెచ్చరిక జారీ చేశారు.కరోనావైరస్ కొత్త వేరియెంట్ ప్రభావాన్ని గుర్తించడం చాలా కష్టమని, ఈ వేరియంట్ వ్యాధికారక క్రిములతో పోరాడగలిగే యువకులను కూడా ప్రభావితం చేసిందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్పారు. కొంతకాలం వైరస్‌ను మోసుకెళ్లిన తర్వాత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో కొవిడ్ టీకా రేటు తక్కువగా ఉంది.ఒమైక్రాన్ వేరియంట్ తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.


దక్షిణాఫ్రికా దేశంలో గత 24 గంటల్లో వెలుగుచూసిన ఒమైక్రాన్ కొవిడ్ కేసుల సంఖ్య రెట్టింపు పెరిగి 8,561కి చేరిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తెలిపింది.ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో పలు ప్రపంచ దేశాలు దక్షిణాఫ్రికా దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. టీకాలు వేయించుకోని వారిలో ఈ కొత్త వేరియెంట్ వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.


Updated Date - 2021-12-02T17:40:57+05:30 IST