ఒమైక్రాన్‌తో ప్రమాదం లేదనే అలసత్వం వద్దు.. కేసులు పెరిగితే.. అమెరికా నిపుణుడి హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-28T03:53:50+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌తో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందన్న అంచనాల కారణంగా ప్రజల్లో అలసత్వం నెలకొనకూడదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ తాజాగా వ్యాఖ్యానించారు.

ఒమైక్రాన్‌తో ప్రమాదం లేదనే అలసత్వం వద్దు.. కేసులు పెరిగితే.. అమెరికా నిపుణుడి హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌తో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందన్న అంచనాల కారణంగా ప్రజల్లో అలసత్వం నెలకొనకూడదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ తాజాగా వ్యాఖ్యానించారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగితే తక్కువ వ్యాధి తీవ్రత కారణంగా కలిగే ప్రయోజనాలన్నీ కోల్పోతామని ఆయన హెచ్చరించారు. ప్రజలు  నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. ఒమైక్రాన్ చాలా వేగంగా వ్యాపించే వేరియంట్ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. అమెరికాలో మరికొంత కాలం పాటు రోజువారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. 

Updated Date - 2021-12-28T03:53:50+05:30 IST