పలు దేశాల్లో BA.2 Omicron వేరియెంట్ కేసుల వ్యాప్తి

ABN , First Publish Date - 2022-03-22T13:42:53+05:30 IST

ప్రపంచంలో బీఏ.2 ఒమైక్రాన్ వేరియెంట్ ఆవిర్భావం తర్వాత పలు దేశాల్లో కొవిడ్ కేసుల సంఖ్య ఉప్పెనలా పెరుగుతోంది....

పలు దేశాల్లో BA.2 Omicron వేరియెంట్ కేసుల వ్యాప్తి

షాంఘై(చైనా): ప్రపంచంలో బీఏ.2 ఒమైక్రాన్ వేరియెంట్ ఆవిర్భావం తర్వాత పలు దేశాల్లో కొవిడ్ కేసుల సంఖ్య ఉప్పెనలా పెరుగుతోంది.పలు దేశాల్లో బీఏ.2 ఒమైక్రాన్ స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. యూరప్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. చైనా దేశంలో బీఏ.2 ఒమైక్రాన్ స్ట్రెయిన్ ను అరికట్టేందుకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించింది.చైనాలో ఈ వైరస్ ను అరికట్టేందుకు కఠినమైన లాక్‌డౌన్‌లు, సామూహిక కరోనా పరీక్షలు చేస్తున్నారు.షాంఘైలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి.షాంఘై నగరం తాజా చైనీస్ కరోనా హాట్‌స్పాట్‌గా మారింది.


 గత 7 రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో 90,000 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.ఫ్రాన్స్ దేశంలో కరోనా కేసుల సంఖ్య 36 శాతం పెరిగింది.జర్మనీ దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతోంది. ఆస్ట్రియాలో కరోనా కేసులు గరిష్ఠస్థాయికి చేరాయి. నెదర్లాండ్ దేశంలో కొవిడ్ కేసులు రెట్టింపు అయ్యాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.న్యూయార్క్ నగరంలో కేసులు పెరగడం ప్రారంభించాయి.అమెరికాలోని మొత్తం కొవిడ్ కేసుల్లో 50 నుంచి 70 శాతం బీఏ.2 అని శాన్ డియాగోకు చెందిన జెనోమిక్స్ సంస్థ హెలిక్స్ అంచనా వేసింది.కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల వినియోగం గురించి చర్చించేందుకు స్వతంత్ర సలహాదారుల బృందం ఏప్రిల్ 6వతేదీన సమావేశమవుతుందని యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ తెలిపింది.


Updated Date - 2022-03-22T13:42:53+05:30 IST