
న్యూఢిల్లీ: కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావంతో డిసెంబర్ 15 న షెడ్యూల్ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు ఇప్పటికే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా కోవిడ్ కొత్త వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ బబుల్" ఆపరేషన్ సిస్టమ్ కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. షెడ్యూల్ చేయబడిన వాణిజ్య పునఃప్రారంభ తేదీ, అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు నిర్ణీత సమయంలో తెలియజేయబడతాయని అధికారులు తెలిపారు.