గర్భిణులకు ఒమైక్రాన్‌?

Published: Tue, 18 Jan 2022 02:39:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మైక్రాన్‌ రిస్క్‌ గర్భిణులకు ఎక్కువే! అయితే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా ఒమైక్రాన్‌తో కలిగే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు ఈ పాండమిక్‌ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన రక్షణ చర్యలు ఇవే!

ఆహారం, నిద్ర: గర్భంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచే పోషకాహారం తీసుకోవాలి. జంక్‌, నూనెతో కూడిన పదార్థాలు, వేపుళ్లు తినకూడదు. ప్రాసెస్‌ చేసినవి, రెడీమేడ్‌గా వండుకోదగినవి తినకూడదు. ఎక్కువ సమయం పాటు విశ్రాంతిలో ఉంటూ, నిద్ర 8 గంటలకు తగ్గకుండా చూసుకోవాలి.


శ్వాస వ్యాయామాలు: ఒమైక్రాన్‌ నుంచి రక్షణ కోసం శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం సాధన చేయవచ్చు. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శ్వాస వ్యాయామాలు సాధన చేయాలి.


ఇంట్లో రక్ష: జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లకుండా, ఇళ్లకే పరిమితమవడం ఉత్తమం. ఇంటికొచ్చే అతిధులు, పరిచయస్తుల సంఖ్యను తగ్గించాలి.


కొవిడ్‌ సోకితే: సెల్ఫ్‌ క్వారంటైన్‌ చేసుకుని, వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. టెంపరేచర్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకుంటూ ఉండాలి. కేర్‌ గివర్‌ వ్యాక్సిన్లు వేయించుకుని ఉండాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.