Omicron Infected బెంగళూరు డాక్టరుకు మళ్లీ పాజిటివ్

ABN , First Publish Date - 2021-12-07T16:53:32+05:30 IST

భారతదేశంలో మొట్టమొదటి ఒమైక్రాన్ కేసుల్లో ఒకరైన 46 ఏళ్ల బెంగళూరు వైద్యుడికి మంగళవారం జరిపిన పరీక్షల్లో మళ్లీ కొవిడ్‌ పాజిటివ్ వచ్చినట్లు...

Omicron Infected బెంగళూరు డాక్టరుకు మళ్లీ పాజిటివ్

బెంగళూరు: భారతదేశంలో మొట్టమొదటి ఒమైక్రాన్ కేసుల్లో ఒకరైన 46 ఏళ్ల బెంగళూరు వైద్యుడికి మంగళవారం జరిపిన పరీక్షల్లో మళ్లీ కొవిడ్‌ పాజిటివ్ వచ్చినట్లు సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.దీంతో ఒమైక్రాన్ రోగి అయిన డాక్టరును క్వారంటైన్ లోనే ఉంచారు. దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో పది, రాజస్థాన్‌లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కరోనా రోగి పరీక్ష తర్వాత ఏడు రోజులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించాలి. కరోనా రోగిని ఏడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. 


ఏడు రోజుల తర్వాత కరోనా పరీక్ష నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేస్తారు.బెంగళూరుకు చెందిన ఇద్దరు ఒమైక్రాన్ రోగులతో పరిచయం ఉన్న 200 మందిని గుర్తించి వారికి కొవిడ్ పరీక్షలు చేశారు.బెంగళూరు వైద్యుడితో పరిచయం ఉన్న ఐదుగురు వ్యక్తులకు నెగిటివ్ అని రిపోర్టు రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు.


Updated Date - 2021-12-07T16:53:32+05:30 IST