ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసిన Omicron వేరియెంట్

ABN , First Publish Date - 2021-12-24T13:18:03+05:30 IST

ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్ యొక్క ఒమైక్రాన్ వేరియంట్ మొదటి కేసు వెలుగుచూసింది....

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసిన Omicron వేరియెంట్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్ యొక్క ఒమైక్రాన్ వేరియంట్ మొదటి కేసు వెలుగుచూసింది. దీంతో అవసరమైతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ,కొవిడ్ ఆంక్షలు విధిస్తామని రాష్ట్ర అధికారులు హెచ్చరించారు.వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.‘‘ డెహ్రాడూన్‌లో ఒక ఒమైక్రాన్ కేసును గుర్తించిన తర్వాత, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించాం.ఒమైక్రాన్ వ్యాప్తిచెందకుండా జిల్లా కలెక్టర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. 





ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులతో పాటు బెడ్‌లను సిద్ధం చేయండి’’ అని చీఫ్ సెక్రటరీ సూచించారు. కొవిడ్ పరీక్షలు, టీకాలు వేయడం కోసం డోర్ టు డోర్ సర్వేను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు. అవసరమైతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, కొవిడ్ ఆంక్షలు విధించాలని యోచిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రలలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 

Updated Date - 2021-12-24T13:18:03+05:30 IST