Omicron scare:ముంబైలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు

ABN , First Publish Date - 2021-12-16T18:18:55+05:30 IST

ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తి భయంతో ముంబైలో డిసెంబర్ 16 వతేదీ నుంచి డిసెంబర్ 31 వరకు సీఆర్‌పీసీ 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు...

Omicron scare:ముంబైలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు

ముంబై(మహారాష్ట్ర): ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తి భయంతో ముంబైలో డిసెంబర్ 16 వతేదీ నుంచి డిసెంబర్ 31 వరకు సీఆర్‌పీసీ 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీటి నివారణకు ముంబై నగరంలో అర్ధరాత్రి వరకు  144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.నూతన సంవత్సరం సందర్భంగా నిషేధాజ్ఞలు విధించారు.క్రిస్మస్,  న్యూ ఇయర్ సందర్భంగా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు హెచ్చరించారు. బహిరంగ సమావేశాలను నిషేధించారు.ఏవైనా ఈవెంట్లకు రెండు డోసుల కొవిడ్ టీకాలు తీసుకున్నవారినే అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. ఒమైక్రాన్ కట్టడికి అధికారులు, పోలీసులు కలిసి కదిలి నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు.


Updated Date - 2021-12-16T18:18:55+05:30 IST