దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో దారుణం.. చెట్టుకు వేలాడదీసి..

ABN , First Publish Date - 2022-05-01T02:09:57+05:30 IST

బిలాస్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి ప్రయత్నించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి అత్యంత దారుణంగా కొట్టారు.

దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో దారుణం.. చెట్టుకు వేలాడదీసి..

బిలాస్‌పూర్ : chhattisgarhలోని బిలాస్‌పూర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి ప్రయత్నించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి అత్యంత దారుణంగా కొట్టారు. వదిలేయాలని చేతులెత్తి వేడుకున్నా కనికరం చూపకుండా నలుగురైదుగురు వ్యక్తులు కలిసి చావబాదారు. bilaspur districtలోని sipat townలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో social mediaలో viral అయ్యింది. వీడియో ప్రకారం.. మహావీర్ అనే వ్యక్తిని తల్లకిందులుగా చెట్టుకు వేలాడదీసి.. బూతులు తిడుతూ కర్రలతో విచక్షిణారహితంగా కొట్టారు. వదిలేయాలని ఎంత ప్రాధేయపడినా మాటవినలేదు. ఇదే ఘటనకు సంబంధించిన మరో వీడియోలోనూ దారుణ దృశ్యాలే కనిపించాయి. మహావీర్ అరుపులు, కేకలు వీడియో చూసినవారిని కలచివేసేలా ఉన్నాయి.


ఈ ఘటనతో సంబంధమున్న నలుగురు నిందితులను సిపట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని చెప్పారు. సిపట్ ఎస్‌హెచ్‌వో(స్టేషన్ హౌస్ ఆఫీసర్) వికాస్ కుమార్ మాట్లాడుతూ.. బాధితుడు మహావీర్ గతవారం దొంగతనం చేసేందుకు తన ఇంట్లోకి చొరబడ్డాడని, ఈ కారణంతోనే దాడి చేసినట్టు నిందితుడు మనీష్ ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. తన కుటుంబ సభ్యులు మహావీర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని మనీష్ చెబుతున్నాడని  పేర్కొన్నారు. ఇరుపక్షాలను పోలీస్ స్టేషన్‌కు పిలిచాం. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమని మనీష్ చెప్పడంతో వార్నింగ్ ఇచ్చి పంపించివేశాం.  వివాదం సెటిల్మెంట్‌కు మహావీర్ కూడా అంగీకరించాడని తెలిపారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-05-01T02:09:57+05:30 IST