ఆలయ భూములపై.. పర్యవేక్షణ కరువు!

ABN , First Publish Date - 2021-05-09T05:27:48+05:30 IST

ఉమ్మడి జిల్లా దేవాలయాల్లో దూప దీప నైవేద్యం కోసం ఏళ్ల క్రితం ఈనాంగా ఇచ్చిన కొన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయి.

ఆలయ భూములపై.. పర్యవేక్షణ కరువు!

ఉమ్మడి జిల్లాలో దేవాలయ భూములపై పర్యవేక్షణ కరువు

ఇతరుల చేతిలో  850 ఎకరాలకు పైగా భూములు

వివిధ కోర్టుల్లో కేసులు వేసిన అధికారులు

భూ ప్రక్షాళనతో ఇతర భూముల లెక్కలు పక్కా

రిజిస్ట్రేషన్‌ కాకుండా సర్వే నెంబర్లు బ్లాక్‌ చేసిన అధికారులు 

నిజామాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా దేవాలయాల్లో దూప దీప నైవేద్యం కోసం ఏళ్ల క్రితం ఈనాంగా ఇచ్చిన కొన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ భూముల రికార్డులను సక్రమంగా పరిరక్షించకపోవడం వల్ల విలువైన భూ ములు ఇతరుల చేతిలోకి వెళ్లాయి. కౌలు పేరున ఇచ్చి న విలువైన భూములు కొన్నేళ్లు పట్టించుకోక పోవడం వల్ల కబ్జాలకు గురయ్యాయి. వీటికి సంబంధించిన కొ న్ని రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల దేవా దాయ ట్రిబ్యునల్‌, ఇతర కోర్టుల్లో కేసులు నమోదు అయ్యాయి. మొదటి నుంచి దేవాలయ కమిటీలు, ప్రజా ప్రతినిధులు ఈ భూములను పట్టించుకోక పోవడం వల్ల ఏళ్ల తరబడి కొనసాగింది.

మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌ దేవాలయ భూముల లాగానే ఉమ్మడి జిల్లాలో కొన్ని దేవాలయాలకు చెందిన భూములు కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికి వారి చేతిలో నే ఉన్నాయి. వివిధ కోర్టుల్లో కేసులు కొనసాగు తున్నాయి. ఇప్పటికీ ఈ భూముల వ్యవహారం తేలకపో వడం వల్ల కొన్ని చోట్ల కట్టడాలు వెలిశాయి. మరికొన్ని చోట్ల ఇతరుల చేతిల్లోకి మారాయి. భూముల ధరలు పెరగడం, గ్రామాలకు, మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్న చోట దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోక పోవడం వల్ల ఇవి ఇతరుల చేతిల్లోకి వెళ్లాయి.

ఉమ్మడి జిలాల్లో 5100 ఎకరాలు

ఉమ్మడి జిల్లాలో సమారు మూడువేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 2500ఎకరాలకు పైగా దేవాదాయ భూములు ఉండగా కామారెడ్డి జిల్లా పరిధిలో 2600 ఎకరాలకు పైగా ఉంది. ఈ భూములను కొన్ని ఏళ్ల క్రితం దాతలు దేవాలయాల కోసం దానం చేశారు. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో దేవాలయాల్లో దూప దీప నైవేద్య కార్యాక్రమాలు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఇచ్చారు. దేవాలయలో జరిగే పూజలు, జాతర్ల నిర్వహణకు ఈ ఆదాయం ఖర్చు చేసేవారు. మొదట ఆయా గ్రామాల పరిధిలో రైతులు సాగుచేసి ధాన్యంను దేవాలయంలో పూజలు చేసే పూజారికి ఇచ్చేవారు. దేవాదాయశాఖ ఆధినంలోకి వచ్చిన తర్వాత ఈ భూములను ప్రతియేడు వేలం పాట నిర్వహించి కౌలుకు ఇస్తున్నారు. దాని మీద వచ్చే ఆదాయం దేవాదాయశాఖ ఆ దేవాలయ పరిధిలో ఖర్చు చేస్తున్నారు. వీటికి సంబంధించిన భూ రికార్డుల న్ని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్నాయి. వీటిని సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్ల ఉమ్మడిజిల్లా పరిధిలో ఈ భూములు కొన్ని చోట్ల కబ్జాలకు గురయ్యాయి.

అన్యాక్రాంతమైన భూములు

నిజామాబాద్‌ జిల్లా పరిధిలో దేవాలయాలకు సం బంధించి ఇరవై ఐదు వందల ఎకరాలకు పైగా భూమి ఉంది. దీనిలో సమారు మూడు వందల ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతం అయ్యింది. నిజామాబాద్‌ రూరల్‌, అర్బన్‌, ఎడపల్లి, బోధన్‌, డిచ్‌పల్లి, ఆర్మూర్‌తో పాటు ఇతర మండలాల్లో ఇతరుల చేతిలోకి వెళ్లింది. ఈ భూములపై దేవాదాయశాఖ కోర్టులతో పాటు ఇత ర కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో సదాశివనగర్‌, గాంధారి, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాలతో ఇతర మండలాలలో 550 ఎకరాలకు పైగా భూములు అన్యక్రాంతం అయ్యాయి, వివిధ కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కౌలుదారులు తమ హక్కుల కోసం కేసులు వేయ గా మరికొన్ని చోట్ల రికార్డులు సక్రమంగా లేకపోవడం, లోసుగులను ఆధారంగా చేసుకొని కేసులను వేశారు. ఈ కేసులు ఇప్పటికి కొనసాగుతున్నాయి. వీటి పై దేవాదాయ, రెవెన్యూ అధికారులు పలుమార్లు విచారణ చేసి నివేదికలు ఇచ్చినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. అన్ని విలువైన భూములు కాగా కొన్ని చోట్ల ఇళ్లను కూడా  నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల అండదండలు కబ్జాదారులకు ఉండడం వల్ల ఈ భూముల వివాదం ఏటు తేలడం లేదు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగతా భూములకు వివా దం లేకపోవడంతో వాటిని భూ ప్రక్షాళన సమయంలో పక్కాగా చేశారు. ధరణిలో ఈ భూములను ఎంట్రీ చే శారు. ఈ భూములు ఎవరి పేరునా రిజిస్ట్రేషన్‌ కాకుం డా సర్వే నెంబర్లను బ్లాక్‌ చేశారు. అన్ని తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌లకు పంపించారు. మూడేళ్లుగా ఈ భూములు ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూస్తున్నారు. దేవాలయాల పేరునే పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పహణీలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఈ భూములకు భారీగా ధరలు పెరగడంతో కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు. అన్యాక్రాంతం అయినా భూములపై అధికారులు దృష్టి పెడితే విలువైన భూములు దేవాలయాలకు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాలయాలకు సంబంధించి సుమారు 850 ఎకరాల భూమి కోర్టుల్లో ఉందని ఆ శాఖ సహాయ కమిషనర్‌ సోమయ్య తెలిపారు. త్వరలోననే వీటిపై తీర్పులు వస్తాయని అన్నారు. మిగతా భూములన్నీ పక్కాగా ఉన్నాయన్నారు. ఈ భూములకు త్వరలోనే దేవాలయాల పేరునా పట్టాలు ఇవ్వనున్నారని తెలిపారు.

Updated Date - 2021-05-09T05:27:48+05:30 IST