శ్రీకూర్మనాథుని జయంతికి వేళాయే

ABN , First Publish Date - 2022-06-23T05:27:23+05:30 IST

శ్రీకూర్మ జయంతి వేడుకలకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం ముస్తాబైంది. ఏటా జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున కూర్మనాథుని జయంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఘనంగా నిర్వహించడానికి ఆలయవర్గాలు, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం వేకువజాము నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. స్వామివారికి నిత్యప్రాభోదిక సేవ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవమూ

శ్రీకూర్మనాథుని జయంతికి వేళాయే

25న ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు
శ్రీకూర్మం (గార), జూన్‌ 22:
శ్రీకూర్మ జయంతి వేడుకలకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం ముస్తాబైంది. ఏటా జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున కూర్మనాథుని జయంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఘనంగా నిర్వహించడానికి ఆలయవర్గాలు, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం వేకువజాము నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. స్వామివారికి నిత్యప్రాభోదిక సేవ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవమూర్తులను ముఖమండపంలో ప్రత్యేక వేదికపై ఉంచి వేడుకలు జరుపుతారు. కూర్మనాథుని అవతారఘట్టంపై అర్చకులు ఆధ్యాత్మిక ప్రవచనమిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారామనరసింహాచార్యులు పర్యవేక్షించనున్నారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.

 స్థలపురాణమిది..

ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శ్రీకూర్మనాథుడ్ని సాక్షాత్‌ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. శ్వేతరాజు తపోఫలంగా శ్రీకూర్మనాఽథస్వామి ఇక్కడ వెలసినట్టు పద్మ, బ్రహ్మాండ పురాణాలద్వారా తెలుస్తోంది.  ఆలయం ఎప్పుడు నిర్మింతమైందన్నదానికి చారిత్రక ఆధారాలు లేవు. నాలుగో శతాబ్ధం నుంచి 14, 16 శతాబ్ధాల వరకూ ఏయే రాజులు ఈ ఆలయాభివృద్దికి ఎంతెంత ఇచ్చారన్నది శాసనాల ద్వారాతెలుస్తోంది. 1135లో అనంతవర్మ చోళగంగదేవుడు దండయాత్రలు చేస్తూ పశ్చిమోత్తర దేశాన్ని జయించినట్టు ఒక శాసనంలో ఉంది. 12వ శతాబ్దానికి పూర్వం దీనిని శైవక్షేత్రంగా వ్యవహరించేవారని ఒక వాదన ఉంది. ఈ ఆలయం పైభాగం అష్ఠదశ పద్మాకారంలో ఉంటుంది. ద్వారాలపై చక్కని శిల్పసంపద కనిపిస్తోంది. ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉండడం విశేషం... సాధారణంగా ఆలయాల్లో మూలవిరాట్‌ తూర్పునకు అభిముఖంగా ఉండడం చూస్తుంటాం.. అయితే ఈ క్షేత్రంలో స్వామివిగ్రహం పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషం. అపురూపమైన శిల్పసంపదలతో చుట్టూ అందమైన శిల్పాల స్తంభాలతో ప్రదక్షణ మండపం ఉంది. ఎదురుగా శ్వేతపుష్కరిణి ఉంది. ఇందులో స్నానం చేసి భక్తులు స్వామిని దర్శించుకుంటారు.  

 త్రిమతాచార్యుల సందర్శన
రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యుని శిష్యుడైన నరహరి తీర్ధాలు ఈ స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. లవకుశలు, బలరాముడు, జయదేవమహాకవి, శ్రీనాథ కవి, జాబాలి, వక్రాంగధుడు, నారదమహాముని మొదలైన వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. పంచశివుడు క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ క్షేత్రంలో గల సుధాగుండంల పితృకార్యాలు ఆచరిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని స్థలపురాణం చెబుతోంది. అంతేకాకుండా ఈ పుష్కరిణిలో అస్తికలు నిమజ్జనం చేస్తే అవి కొద్దిరోజులకే శిలలుగా మారుతాయని పురాణాలు చెబుతున్నాయి.


Updated Date - 2022-06-23T05:27:23+05:30 IST