యువజన దినోత్సవం సందర్భంగా

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన యువతకు వక్తృత్వ, క్విజ్‌, గ్రాఫిక్స్‌,

యువజన దినోత్సవం సందర్భంగా

12న యువతకు పోటీలు


కడప(స్పోర్ట్స్‌), ఆగస్టు 6: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన యువతకు వక్తృత్వ, క్విజ్‌, గ్రాఫిక్స్‌, పోస్టర్‌ రైటింగ్‌, కోవిడ్‌-19, ఎయిడ్స్‌, ట్రాఫిక్‌ కంట్రోల్‌, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగం, నవరత్నాలు, స్వచ్చభారత్‌ తదితర అంశాలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తున్నట్లు స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విరాలకు 08562-241617 నెంబర్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని వివరించారు. 15-29 సంవత్సరాల మధ్యవయసున్నవారు ఈ పోటీలకు అర్హులని, ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోటీలుంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచినవారు స్టెప్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST