Mohanlal Birthday: కార్ల కలెక్షన్ల నుంచి.. రెమ్యూనరేషన్ వరకు.. మోహన్‌లాల్ గురించి ఆసక్తికర విషయాలివి..

Published: Sat, 21 May 2022 18:57:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mohanlal Birthday: కార్ల కలెక్షన్ల నుంచి.. రెమ్యూనరేషన్ వరకు.. మోహన్‌లాల్ గురించి ఆసక్తికర విషయాలివి..

విలక్షణ నటన, విభిన్న పాత్రలతో అలరిస్తున్న మలయాళీ నటుడు మోహన్ లాల్ (Mohanlal). మలయాళం ఇండస్ట్రీలోని సూపర్ స్టార్స్‌లో ఆయన ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అనేక సక్సెస ఫుల్ సినిమాల్లో నటించారు. మాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒక్కో చిత్రానికి రూ. 8కోట్ల నుంచి 17కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని మాలీవుడ్‌లో వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. మే 21న లాల్ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా..  


మోహన్ లాల్‌కు కార్లు అంటే చాలా ఇష్టం. అందువల్ల గ్యారేజీలో అనేక ఖరీదైన కార్లకు చోటిచ్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆయన దగ్గర తెలుపు రంగులో ఉన్న మోటార్ కార్స్ మాత్రమే ఉన్నాయి. టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్-350, లంబొర్గిని ఉరుస్ వంటి విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నారు. ఈ స్టార్ హీరోకు వాచ్‌లు అంటే పిచ్చి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ ట్రావెల్ టైమ్, ఆర్‌ఎమ్-03 మెక్ లారెన్, రోలెక్స్ యాచ్-మాస్టర్, మాంట్‌ బ్లాంక్ ఆర్బిస్ టెర్రరమ్ వరల్డ్ టైమ్ వంటి విలాసవంతమైన బ్రాండ్స్ వాచ్‌లు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘ఎలోన్’(Alone), ‘మాన్‌స్టర్’(Monster), ‘బరోజ్’(Barroz), ‘రామ్’, ‘ఎల్ -2: ఎంపురన్’(L2: Empuraan), ‘దృశ్యం-3’(Drishyam 3) వంటి సినిమాల్లో నటించనున్నారు. మోహన్ లాల్ నుంచి వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ (Marakkar: Arabikadalinte Simham). యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. రూ. 100కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ తెరకెక్కించారు. కరోనా వల్ల ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడింది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్స్‌లో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International