మూడవ రోజు వైద్యుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-02T06:33:06+05:30 IST

తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చే స్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట సినియర్‌ రెసి డెంట్‌ వైద్యులు శుక్రవారం మూడవ రోజు తమ ఆందోళనను కొనసాగిం చారు.

మూడవ రోజు వైద్యుల ఆందోళన
ఫ్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలుపుతున్న వైద్యులు

జగిత్యాల టౌన్‌, జూలై 1 : తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చే స్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట సినియర్‌ రెసి డెంట్‌ వైద్యులు శుక్రవారం మూడవ రోజు తమ ఆందోళనను కొనసాగిం చారు. చేసిన అప్పులకు ఈఎమ్‌ఐలు టైంకి వస్తున్నాయి కానీ జీతాలు రా వడం లేదని వైద్యులు ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.  మూడవ రోజు శుక్రవారం వైద్యులు కళాశాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరిం చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్స్‌ డేను పురస్కరించుకుని జగి త్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు ఫ్లకార్డు లు పట్టుకుని నిరసన స్వాగతం పలికారు. 


Updated Date - 2022-07-02T06:33:06+05:30 IST