మరోసారి ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-07-21T05:53:25+05:30 IST

కరోనా మహమ్మారి శాంతించడం లేదు. ఇతర జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్నా సిరిసిల్ల జిల్లాలో నిత్యం 60కిపైగా వస్తున్న కేసులతో ఆందోళనలు నెలకొంటున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ బృందం కూడా సిరిసిల్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమ త్తం చేస్తూనే ఉంది.

మరోసారి ఫీవర్‌ సర్వే
ఇల్లంతకుంటలో సర్వే చేస్తున్న వైద్య బృందం

- జిల్లాలో 453 బృందాలు  

-  ముందస్తు నిర్ధారణతో సత్ఫలితాలు  

-  మూడు విడతల్లో 8,731 మంది గుర్తింపు 

-  నాలుగో విడతలో 646 మంది 

-  కిట్లు పంపిణీ చేస్తున్న వైద్య సిబ్బంది 

-  జిల్లాలో వెంటాడుతున్న కరోనా మహమ్మారి 

-  నిత్యం 60కి పైగా కేసులు  

-   ప్రస్తుతం 776 మంది బాధితులు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా మహమ్మారి శాంతించడం లేదు. ఇతర జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్నా సిరిసిల్ల జిల్లాలో నిత్యం 60కిపైగా వస్తున్న కేసులతో ఆందోళనలు నెలకొంటున్నాయి.  వైద్య, ఆరోగ్య శాఖ బృందం కూడా సిరిసిల్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమ త్తం చేస్తూనే ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేత తరువాత జిల్లా వ్యాప్తంగా శుభకార్యాలు, పండుగలు పెరిగా యి. ఆషాఢంలో బోనాల పేరిట ఉత్సవాలు జరుపు కుంటున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో  జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత ఫీవర్‌ సర్వేను చేపట్టారు.  సర్వే కొంత మేర  సత్ఫలితాలు ఇస్తుండడంతో నిరంతరం కొనసాగిం చాలని భావిస్తున్నారు. ఇంతకుముందు మూడు విడతల్లో చేపట్టిన  ఫీవర్‌ సర్వే కరోనా కట్టడికి కొంత దోహదపడింది. 


మూడు విడతల్లో 8,731 మంది గుర్తింపు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగో విడత ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. గత మూడు విడతల్లో 8,731 మందిని కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిగా గుర్తించి కిట్‌లను అందించారు. ప్రస్తుతం నాలుగో విడతలో ఇప్పటికే 646 మందిని గుర్తించారు. వారిని అప్రమత్తం చేస్తున్నారు. కిట్లు అందజేసి ఇళ్ల లోనే ఉండాలని సూచిస్తున్నారు.  మొదటి విడతలో 1,47,090 ఇళ్లను అధికారులు, వైద్య సిబ్బంది సంద ర్శించారు.  3,789 మందిని లక్షణాలు ఉన్నవారిగా గుర్తించారు. రెండో విడతలో 1,45,972 ఇళ్లలో సర్వే చేపట్టారు. ఇందులో 3,232 మందిని గుర్తించారు. మూడో విడతలో 1,51,260 ఇళ్లలో పర్యటించి  1710 మందికి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వారికి కిట్లను అందజేశారు. ప్రస్తుతం 453 బృందాలతో చేపట్టిన సర్వేలో ఇప్పటి వరకు 1,49, 165 సందర్శించారు. 646 మందిని గుర్తించి కొవిడ్‌ నివారణ కిట్‌లను అందించారు.ముందస్తుగానే సర్వే ద్వారా జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంతో కరోనాతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌ గున్యా వంటి వాటిని కూడా నివారించ వచ్చని భావిస్తున్నారు. ఫీవర్‌ సర్వేలో జ్వరం గురిం చి తెలుసుకోవడమే కాకుండా ప్రతీ శుక్రవారం ‘డ్రై’డే పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. 


జిల్లాలో 776 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 30,284 మంది కొవిడ్‌ బారిన  పడ్డారు. వీరిలో 28,995 మంది కోలుకున్నారు. 513 మంది మృతి చెందారు. 776 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతీరోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. జిల్లాలో కొవిడ్‌ తన ప్రభావాన్ని చూపుతోంది. ఫస్ట్‌వేవ్‌లో 13,380 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 16,904 మందికి పాజి టివ్‌ వచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 513 మంది మృతిచెందారు. మొదటి వేవ్‌లో 165 మంది మృతిచెందగా సెకండ్‌ వేవ్‌లో 348 మంది చని పోయారు. కరోనా కేసులు తగ్గకపోవడంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదనే అందోళనలు నెలకొన్నాయి. మళ్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుం దోననే భయం వెంటాడుతోంది. మరోవైపు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించక పోవడం వంటివి వైరస్‌ వ్యాప్తికి దోహద పడుతున్నాయి.  

Updated Date - 2021-07-21T05:53:25+05:30 IST