పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ ఒక్కచోటకు చేరిన నాటి విద్యార్థులు
కురిచేడు, మార్చి 27: తామకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలకు 33 ఏళ్ల తర్వాత తిరిగి చేరుకున్నారు. తమ తరగతి గదులను మరోసారి పరికించారు.. ఎవరెవరు ఎక్కెడెక్కడ కూర్చొనేవారో గురుచేసుకుంటూ , గత పాఠాలు విన్న తీరును ఆసక్తిగా సహ చరులతో పంచుకున్నారు. ఆడిపాడిన చోట నాటి స్నేహితలతో మరోసారి కలయదిరి గారు. కురిచేడు వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 విద్యా సంవ్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం తమ పాఠశాల ఆవరణలో కలసి గత స్మృతులను నెమరు వేసుకున్నారు. విద్యార్థులంద రూ కలసి తమ గురువులను ఘనంగా సన్మానించారు. తాము ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉందనుకున్నారు. తాము చదివిన పాఠశాలకు ఏదైనా చేయాలని తీర్మానిం చుకున్నారు. మరోసారి ఇలా కలసి అంతా సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నారు.