మరో సారి హైకోర్టుకు కొండగట్టు వ్యాపారులు

ABN , First Publish Date - 2021-07-23T06:05:27+05:30 IST

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలోని వివిధ రకాల అద్దె దుకాణాల వ్యాపారులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

మరో సారి హైకోర్టుకు కొండగట్టు వ్యాపారులు
కొండగట్టు అంజన్న ఆలయం

ఫటెండర్ల గడువు పొడిగించాలని వేడుకోలు

ఫస్టే వస్తే టెండర్లు మళ్లీ నిలిచిపోయే అవకాశం

మల్యాల, జూలై 22: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలోని వివిధ రకాల అద్దె దుకాణాల వ్యాపారులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఏడాది కాలపరిమితి పొడిగిం చాలని విన్నవించారు. కొండపైన ఆలయ పరిధిలో గల పలు దుకాణాలు ఇతరత్రా గతే డాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మూతపడ్డాయి. దానికి సంబంధించిన కాలపరిమితి ఏడాది పొడిగించాలని వ్యాపారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు తాత్కాలికంగా మూడు నెలల పాటు కొనసాగించేందుకు గత మార్చిలో హైకోర్టు ఉ త్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా మార్చితో కాలపరిమితి ముగియడంతో అప్పట్లో అధికారులు నిర్వహించ తలపెట్టగా కోర్టు టెండర్‌ నోటీసును సస్పెన్షన్‌ చేయడంతో టెండర్లు నిలిపివేశారు. తాజాగా మళ్లీ టెండర్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండడంతో వ్యాపారులు గురువారం మళ్లీ కోర్టును ఆశ్రయించారు. గతేడాది మార్చి 20నుంచి లాక్‌ డౌన్‌తో కొండపైన గల దుకాణాలు మూసివేశారు. వాటి టెండరు గడువు 2021 మార్చితో ముగుస్తుండగా మార్చి నుంచి 8 నెలల పాటు దుకాణాలు పూర్తిగా తెరచుకోలేదని తరు వాత కూడా భక్తులు రాకపోవడంతో నష్టపోయామంటూ వ్యాపారులు ఆందోళన చెందు తూ ఏడాది కాలపరిమితి పెంచాలని అభ్యర్థించారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ని ర్ణయం తీసుకోలేదంటూ అధికారులు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చితో దుకాణాల గడువు ముగుస్తుండడంతో ఆలయ అధికారులు దుకాణాల నిర్వహ ణకు గాను కొత్త టెండర్ల కోసం నోటీస్‌ జారీ చేసి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీంతో వ్యాపారులు హైకోర్టును అశ్రయించారు. దీంతో హైకోర్టు టెండర్లను నిర్వహించవద్దని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఎప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు దుకాణాల నిర్వహణ యధావిధిగా కొనసాగించుకునేలా చూడాలని సూచించింది. దాంతో పాటు దుకాణాల నిర్వహణకు అధికారులు జారీ చేసిన టెండరు నోటీసును సస్పెన్షన్‌ చేసింది. దీంతో టెండర్లను అధికారులు వాయిదా వేశారు.

ఫమళ్లీ టెండర్లుకు ఏర్పాట్లు..

హైకోర్టు ఉత్తర్వులు జూన్‌తో ముగియడంతో ఆలయ అధికారులు మళ్లీ టెండర్ల ప్రక్రి య చేపట్టారు. జూలై 26న నిర్వహించడానికి ప్రకటనలు జారీ చేశారు. దీంతో వ్యాపా రులు మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల గడిచి నప్పటికీ ఆ కాలపరిమితిలో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టారని అలాంటప్పుడు కాల పరిమితి ముగిసినట్టు కాదని అంటున్నారు. లాక్‌డౌన్‌లో ఆలయంతో పాటు దుకాణాలు పూర్తిగా మూసిఉంచారని అధికారులు అదేం పట్టించుకోకుండానే మళ్లీ టెండర్లు నిర్వహణకు చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు మాత్రం కోర్టు గడువు పూర్తి అయిందని, అలాగే తామకు ప్రభుత్వం నుంచి పొడగింపు ఆదేశాలు రానందున నిబంధనల మేరకు టెండర్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఫమరోసారి కోర్టుకు వ్యాపారులు

ఈ నెల 26న టెండర్లు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో వ్యాపారులు గురువారం మరోసారి కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం గడువు పెంచకపోవడం, కోర్టు ఇచ్చిన సమయంలో మళ్లీ లాక్‌డౌన్‌ రావడంతో తాము తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతూ టెండర్లను నిలిపివేయాలని కోర్టును వేడుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తమకు ఏడాది గడువు పొడగించాలని కోరుతున్నారు. ఇటీవల వేములవాడ దేవస్థానం పరిధిలోని వ్యాపారులు కూడా కోర్టుకు వెళ్లడంతో టెండర్లు తాత్కాలికంగా నిలి చిపోయినట్లు వారు తెలిపారు. కొండగట్టులో టెండర్ల నిలిపివేతకు హైకోర్టు తమకు కూ డా స్టే అందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. స్టే కనుక వస్తే ఈ నెల 26న నిర్వహించే టెండర్లు నిలిచిపోయే అవకాశం ఉంది.

Updated Date - 2021-07-23T06:05:27+05:30 IST