సిరిగిరిపేట్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్
తాండూరు రూరల్, జూన్ 22 : ఒక్కసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే.. తాండూరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్కూడ్ రమేష్ పేర్కొన్నారు. బుధవారం తాండూరు మండలం సిరిగిరిపేట్, రాంపూర్, రాంపూర్‌మీదితండా, రాంపూర్ కింది తం డాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ తరఫున తానే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పటివరకూ రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతుల రుణాలు మూడింతలుగా పెరుగుతున్నాయన్నారు. పంట సాయం కూడా అందించలేని ధీనావస్థలో ఉన్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటికైనా తాండూరు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు పటేల్ జనార్దన్‌రెడ్డి, ఉత్తంచంద్, ఎంపీటీసీ రాజ్‌కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు జగదీష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పురుషోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు వెంకటయ్య, చంద్ర్యానాయక్, అలీం, బాతుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.