ఒక్క రోజు సీఎం!

ABN , First Publish Date - 2021-01-24T06:11:41+05:30 IST

అర్జున్‌ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమా చూసే ఉంటారు కదా! అందులో హీరో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. అచ్చం అలాగే ఉత్తరాఖండ్‌కు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం 19 ఏళ్ల సృష్టి గోస్వామికి...

ఒక్క రోజు సీఎం!

అర్జున్‌ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమా చూసే ఉంటారు కదా! అందులో హీరో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. అచ్చం అలాగే ఉత్తరాఖండ్‌కు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం 19 ఏళ్ల సృష్టి గోస్వామికి దక్కింది.


  1. ఇంతకీ ఆమెకు ఆ అవకాశం ఎందుకొచ్చిందంటే ఈ రోజు (జనవరి 24) జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.
  2. ఉత్తరాఖండ్‌ వేసవికాల రాజధాని అయిన గైర్‌సైన్‌ నుంచి ఆమె సీఎంగా విధులు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల పనితీరును తెలుసుకోనున్నారు. 
  3. అధికారులు ఆమెకు పథకాలకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను అందించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు హాజరయ్యేలా చూడాలని ఉత్తరాఖండ్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ చీఫ్‌ సెక్రెటరీకి లెటర్‌ రాశారు. 
  4. సృష్టి గోస్వామి హరిద్వార్‌ జిల్లా దౌలతాపూర్‌ గ్రామానికి చెందిన వారు. ఆమె తండ్రి ప్రవీణ్‌ బిజినెస్‌మెన్‌. అమ్మ సుధా గోస్వామి గృహిణి. 
  5. సృష్టి రూర్కేలోని బిఎస్‌ఎమ్‌ పీజీ కాలేజ్‌లో బిఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతోంది. గతంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సృష్టికి ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం రావడాన్ని నమ్మలేకపోతోంది. ‘‘ఒక్కరోజు సీఎం ఉండే అవకాశం నాకు లభించిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అయితే యువత ఎందులోనూ తీసిపోదని నిరూపిస్తాను. నాకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా’’ అని అంటున్నారు సృష్టి.

Updated Date - 2021-01-24T06:11:41+05:30 IST