నాగేంద్రబాబు (ఫైల్)
గణపవరం, జనవరి 21: గణపవరంలోని బొబ్బిలి వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం సుమారు 7.30గంటల సమయంలో నిడమర్రు నుంచి గణపవరం మీదుగా ఉండికి బైక్‌పై వెళ్తున్న నాగేంద్రబాబు (28)ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. నిడమర్రు వైఎస్‌ఆర్ కాలనీలో నివాసం ఉండే నాగేంద్రబాబు ఉండి లోని ఒక రొయ్యల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇతనికి ఒక బాబు, నాలుగు నెలల పాప, భార్య ఉన్నారు. ఉదయం ఫ్యాక్టరీకి వెళ్తుండగా బొబ్బిలి వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో నాగేంద్రబాబు తలపై నుంచి లారీ దూసుకుపోవడంతో అతను మృతి చెందాడని, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.