రామాలయ నిర్మాణానికి ఒక్కటై

ABN , First Publish Date - 2022-07-01T05:40:40+05:30 IST

మండలంలోని భీమవరం నిత్యం గొడవలతో ఉండే గ్రామం. ఆ గ్రా మంలో రామాలయం నిర్మించేందుకు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కాలే దు.

రామాలయ నిర్మాణానికి ఒక్కటై

పార్టీలను పక్కన పెట్టి ముందుకొచ్చిన టీడీపీ, వైసీపీ వర్గాలు

రూ.1.50కోట్ల విరాళాలతో చురుగ్గా పనులు

గ్రామస్థుల ఆనందం 

ముండ్లమూరు, జూన్‌ 30 : మండలంలోని భీమవరం నిత్యం గొడవలతో ఉండే గ్రామం. ఆ గ్రా మంలో రామాలయం నిర్మించేందుకు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కాలే దు. ఐతే చుట్టు పక్కల గ్రామాల్లో దేవాలయా లు నిర్మాణం చేసి ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగు తున్నాయి. దీంతో ఆ గ్రామంలో ఉన్న వైసీపీ, టీడీపీ వర్గీయులు పార్టీలను పక్కన పెట్టి ఏకతాటిపై నిలిచారు. ఎలా గైనా రామాలయాన్ని నిర్మించి తీరాలని నిర్ణయానికి వచ్చారు. రూ.1.50 కోట్ల విరాళాలతో కోదండ రామాలయం నిర్మించేందుకు ముందుకొచ్చారు. చకాచకా భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాది కాలం నుంచి కోదండ రామాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్ర స్తుతం ఆలయం పూర్తయి గోపురం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.కోటి ఖర్చు పెట్టారు. మరో రూ.50 లక్షలతో పనులు చేస్తున్నారు. మొత్తం ఆలయ ప్రతిష్ఠ పూర్తికి మరో ఐదారు నెలలు పడుతుం ది. గ్రామంలో రెండు పార్టీలు ఉండటంతో పాటు అత్యధికంగా తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఉన్నా కూడా గ్రామంలో రామాలయం నిర్మించటం కోసం గత సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ లేకుండా వైసీపీ మద్దతు దారుడికి కట్ట బెట్టారు. ఏకగ్రీవమైన వైసీపీ అభ్యర్థి అనమనమూరి సుజాత వెంకటరావు  రూ.లక్ష  ఇవ్వడం, తరువాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికితే రామాలయానికి కొంత డబ్బులు ఇప్పిస్తానన్నారు. ఆ నగదును కూడా ఆలయానికి వినియోగిం చు కున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి వారు వారి స్థోమత  మేరకు విరాళాలను అందజేశారు. దీం తో ఆలయ పనులు చురుగ్గా సాగడానికి గ్రామస్థుల ఐక్యత, కృషి ఉంది. పురాతన కాలానికి చెందిన రామాలయం శిథిలావస్థకు చేరింది. దానిని పునర్‌నిర్మించే పనులు చేపట్టాల న్నా గ్రామంలో రెండు వర్గాలు ఉండడంతో రెండు దశాబ్దాలుగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. చదువుకున్న యువకులు ఎక్కువ మంది తమ గ్రామంలో ఉన్న రామాలయాన్ని పునర్నిర్మించాలని ఆలోచించి గ్రామ పెద్దలతో మాట్లాడి పార్టీలు శాశ్వతం కాదు, గ్రామాభివృ ద్ధి, భక్తి శాశ్వతం అంటూ అవగాహన కల్పించడం యువత ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు. మొత్తమ్మీద భీమవరంలో  రెండు పార్టీలు ఒక్కటిగా నిలిచి రామాల యాన్ని నిర్మిస్తుండడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-01T05:40:40+05:30 IST