ముంబై నుంచి వచ్చి డ్రగ్స్‌ విక్రయిస్తుండంగా..!

ABN , First Publish Date - 2021-06-24T14:43:57+05:30 IST

ముంబై నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్‌ విక్రయిస్తున్న విదేశీయుడిని

ముంబై నుంచి వచ్చి డ్రగ్స్‌ విక్రయిస్తుండంగా..!

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : ముంబై నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్‌ విక్రయిస్తున్న విదేశీయుడిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పీఎస్‌కు అప్పగించారు. సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన ప్రకారం పశ్చిమ ఆఫ్రికా ఘనా రిపబ్లిక్‌ దేశానికి చెందిన జోసెఫ్‌ టాగో అలియాస్‌ జో(25) నాలుగేళ్ల క్రితం జాబ్‌ వీసాపై భారత్‌కు వచ్చి ముంబైలో ఉంటూ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేశాడు.  డ్రగ్స్‌ విక్రేతలతో పరిచయం ఏర్పడడంతో వారితో కలిసి డ్రగ్‌ పెడ్లర్‌గా మారాడు. ఇరవై రోజుల క్రితం నగరానికి వచ్చిన జోసేఫ్‌ నారాయణగూడ రాజమొహల్లా ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ముందస్తు సమాచారంతో ఇతనిపై నిఘా పెట్టిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం డ్రగ్స్‌ విక్రయిస్తుండంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి పాస్‌పోర్టుతో పాటు 30గ్రాముల కొకైన్‌, 30వేల నగదు, సెల్‌ఫోన్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-06-24T14:43:57+05:30 IST