Panchkula: డేరాబాబాకు నేడు శిక్ష ఖరారు..144 సెక్షన్ విధింపు

ABN , First Publish Date - 2021-10-12T15:03:41+05:30 IST

డేరా బాబా ఆశ్రమం మేనేజర్‌ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా)కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో...

Panchkula: డేరాబాబాకు నేడు శిక్ష ఖరారు..144 సెక్షన్ విధింపు

పంచకుల (హర్యానా): డేరా బాబా ఆశ్రమం మేనేజర్‌ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా)కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో పంచకుల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.ముందుజాగ్రత్తగా పోలీసులు పంచకుల నగరంలో మంగళవారం 144 సెక్షన్ విధించారు.పంచకుల వీధుల్లో అదనంగా పోలీసు బలగాలను మోహరించారు. లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాను ఓ హత్య కేసులో పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది.డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్2002 జులై 10న హత్యకు గురయ్యారు. 


డేరాలోని మహిళలపై జరిగే ఆకృత్యాలను రంజిత్ సింగ్‌ బయటపెట్టాడనే అనుమానంతో గుర్మిత్ అతన్ని హతమార్చాడని సీబీఐ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.రంజిత్ సింగ్ హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. 2003 నవంబర్‌లో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబా 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. 


Updated Date - 2021-10-12T15:03:41+05:30 IST