వంద శాతం వ్యాక్సినేషనకు కృషి

ABN , First Publish Date - 2021-06-13T05:08:02+05:30 IST

గాండ్లవీధి సచివాలయ పరిధిలో వంద శాతం వ్యాక్సిన వేయించేందుకు కృషి చేస్తామని వార్డు కౌన్సెలర్‌ ఎం.సునీత, సచివాలయ కార్యద ర్శి పెంచలయ్య పేర్కొన్నారు.

వంద శాతం వ్యాక్సినేషనకు కృషి
బద్వేలులో రెడ్డయ్య మఠం వద్ద ఇంటి వద్దే వ్యాక్సినేషన చే స్తున్న దృశ్యం

వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్‌ సునీత

గోపవరం మండలంలో డాక్టర్‌ వాసుదేవరెడ్డి

బద్వేలు రూరల్‌, జూన 12: గాండ్లవీధి సచివాలయ పరిధిలో వంద శాతం వ్యాక్సిన వేయించేందుకు కృషి చేస్తామని వార్డు కౌన్సెలర్‌ ఎం.సునీత,  సచివాలయ కార్యద ర్శి పెంచలయ్య పేర్కొన్నారు. శనివారం 33 వ వార్డు గాండ్లవీధిలో ఉన్న రెడ్డయ్యమ ఠం వద్ద వ్యాక్సినేషన చేపట్టిన వారు మా ట్లాడుతూ 15 రోజులుగా సచివాలయ పరిధిలో గాండ్లవీధి, రెడ్డయ్యమఠంవీధి, రాజుగారివీధి, బంకపాలెం, దిగువపాలెం, గూ డెం గ్రామాల్లో ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన  వేయిస్తున్నామన్నారు.

ఇందుకు ఏఎనఎంలు, ఆశ కార్యకర్తలు, వార్డు వలంటీర్ల ద్వా రా ప్రజలకు అవగాహన కల్పించి ఇప్పటికి 85 శాతం మేర వ్యాక్సినేషన పూర్తి చేశామ న్నారు. త్వరలో వంద శాతం వ్యాక్సినేషన పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎనఎం నాగరాజమణి, ఆశావర్కర్‌ రేణుక, వార్డువలంటీర్లు క్రిష్ణవేణి, రమాదేవి, మ ధు, టీడీపీ నేత ఎం.ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన

గోపవరం, జూన 12: కరోనా నియంత్రణ లో భాగంగా ఇంటింటికీ వ్యాక్సినేషన చేపట్టినట్లు మండల వైద్యాఽధికారి డాక్టర్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. శనివారం బెడుసుపల్లె లో ఇంటింటికీ వ్యాక్సినేషన ప్రక్రియ చేపట్టారు. బుచ్చనపల్లి, సంగసముద్రం, గోపవ రం గ్రామాల్లో 300మందికి వ్యాక్సినేషన్‌ చేయించారు.

45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన వేస్తామని, ఈ అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకుని కొవిడ్‌ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీహెచఓ గౌస్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-06-13T05:08:02+05:30 IST