ఉపాధి కూలీలకు వంద శాతం పని కల్పించాలి

Jun 17 2021 @ 00:56AM
మొక్కలను పరిశీలిస్తున్న డీపీవో నరేష్‌

- డీపీవో నరేష్‌

కోరుట్ల రూరల్‌, జూన్‌ 16: ఉపాది కూలీలకు వం ద శాతం పని కల్పించాలని డీపీవో నరేష్‌ అన్నారు. బుధవారం మండలంలోని మోహన్‌రావుపేట, పైడిమడుగు గ్రామాలలో ఎంపీడీవో ప్రవీణ్‌తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలో నిర్వహించే ఉపాధి పనులతో పాటు పారిశుధ్య పనులు, రైతు వేదిక భవనాలను పరిశీలిం చారు. గ్రామాలలో పారిశుద్ద్య పనుల వివరాలను అడిగి తెలుసుకోని అంటువ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. హరిత హారం నాటిన మొక్కల అభివృద్దిని పరిశీలించి కోత్తగా నాటే మొక్కల కోరకు స్థల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు మల్లారెడ్డి, భీంరెడ్డి, ఏపీవో మమతలతో పాటు పంచాయితీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on: