వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయం

Published: Fri, 20 May 2022 00:17:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయం పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి, అధ్యాపకులు

వేంపల్లె, మే 19: ట్రిపుల్‌ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 81.87శాతం మం ది విద్యార్థులు పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైనందున అభినందనసభ ఏర్పాటు చేశా రు. ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జుపిటర్‌, ఇన్ఫోసిస్‌, టెస్‌, విప్రో, కాప్‌జెమిని, క్రెడిట్‌ విద్య, హెచ్‌సీఎల్‌, ఇన్నోమైండ్స్‌ కంపెనీలలో రూ.6లక్షల నుంచి రూ.24 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌తో పాటు ప్లేస్‌మెంట్‌ విభాగపు అధిపతి డాక్టర్‌ నాగరత్నకిషోర్‌, ఇతర అధ్యాపకులు అభినందించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.