Advertisement

వంద శాతం రుణాలు ఇవ్వాలి : కలెక్టర్‌

Mar 6 2021 @ 22:37PM
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, మార్చి 6 : జి ల్లాలో కొత్తగా ఏ ర్పడిన సంఘాల ఖా తాలకు ఈనెల 25వ తేదీలోపు వంద శా తం రుణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిచందన బ్యాం కర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లో సెర్ప్‌, స్ర్తీనిధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2020-21 సంవత్స రానికి రూ.141 కోట్లు మంజూరయ్యాయని, బ్యాంక్‌ లింకేజీ కింద రూ.162 కోట్లు ఉన్నాయని తెలి పారు. ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే టార్గెట్‌ను నిర్దేశించుకొని రికవరీ చేయాలని, లేనియెడల చర్యలుతప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. సమావే శంలో డీఆర్డీఏకాళిందిని, స్ర్తీనిధి మేనేజర్‌, ఎల్డీఎం ప్రసన్నకుమార్‌, డీపీఎం, ఏపీఎంలు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement