‘ఎమ్మెల్సీ పోరు’కు ఓటెత్తారు

ABN , First Publish Date - 2020-10-10T09:31:21+05:30 IST

జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా సాగిం ది. జిల్లా వ్యాప్తంగా నూటికి నూరు శాతం ఓట్లు

‘ఎమ్మెల్సీ పోరు’కు ఓటెత్తారు

జిల్లాలో నూటికి నూరు శాతం పోలింగ్‌ నమోదు

ఓటు హక్కు వినియోగించుకున్న 341 మంది ప్రజాప్రతినిధులు

పోస్టల్‌ బ్యాలెట్‌, పీపీఈ కిట్లతో ఓటు వేసిన పలువురు కరోనా పాజిటివ్‌ ప్రతినిధులు

క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు

కామారెడ్డిలో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి


కామారెడ్డి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా సాగిం ది. జిల్లా వ్యాప్తంగా నూటికి నూరు శాతం ఓట్లు పోలయిన ట్లు పోలింగ్‌ అధికారులు తెలిపారు. జిల్లాలోని 22 పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం 341 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ పోల యినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి అభ్య ర్థులు బరిలో ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్‌లు, ఎక్స్‌ అఫిషీయో ప్రజాప్రతినిధులంతా నేరుగా క్యాంపుల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలకు లోబడే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు సామాజిక దూరాన్ని పాటిస్తూ క్యూలో ఉండి ఓట్లు వేశారు. ఓటర్లకు కేంద్రాల వద్ద శానిటైజ ర్‌ సౌకర్యాలను కల్పిం చారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతిని ధులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగిం చుకోగా మరికొందరు పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌ కేంద్రా నికి వెళ్లి ఓట్లు వేశారు.


నూటికి నూరు శాతం పోలింగ్‌ నమోదు

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వారి వారి అభ్యర్థులను గెలిపి ంచుకునేందుకు స్థానిక సంస్థలైన జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌ ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్‌అఫీషియో కింద స్థానిక ఎమ్మెల్యే లు ఓట్లు వేస్తారు. అయితే జిల్లాలో మొత్తం 341 ఓట్లు ఉన్నాయి. ఈ పోలింగ్‌లో 341 మంది ప్రజాప్రతి నిధులు ఓట్లు వేశారు. శాసనసభ స్పీకరు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సు వాడ మున్సిపల్‌ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామా రెడ్డిలో ఓటు వేయగా, ఎమ్మెల్యే హన్మ ంత్‌షిండే మద్నూర్‌లో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఎల్లారెడ్డి లో ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతిని ధులు పోస్టల్‌ బ్యాలెట్‌, పీపీఈ కిట్‌ను ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధారి జడ్పీటీసీ, రాజంపేటలో ఓ ఎంపీటీసీలకు పాజిటివ్‌ రావడం తో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోగా దోమకొండ, రామారెడ్డి మండలాల్లోని ఇద్దరు ఎంపీటీసీలకు కరోనా వైరస్‌ సోకడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.


పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన అధికారులు, అభ్యర్థులు

జిల్లాలో మొత్తం 22 పోలింగ్‌ కేంద్రాలను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భ ంగా ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బరిలో ఉన్న మాజీ ఎంపీ కవిత కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోని ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణ ంలోని పోలింగ్‌ కేంద్రాన్ని కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి పరిశీలించి పోలింగ్‌ సరళిని అధికారు లను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి, తాడ్వాయి లతో పాటు పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనల మేరకే అభ్యర్థులు ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలింగ్‌ విధులలో ఉన్న అధికారులకు, సిబ్బందికి కలెక్టర్‌ శరత్‌ పలు ఆదేశాలు జారీ చేస్తూ సలహాలు, సూచ నలు ఇచ్చారు. భిక్కనూరు పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా ముందుగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


పోలైన ఓట్ల వివరాలు

క్ర.సంఖ్య    మండలం    మొత్తం ఓట్లు    పోలైన ఓట్లు 

1 రామారెడ్డి 11 11

2 మాచారెడ్డి 14 14

3 దోమకొండ 10 10

4 బీబీపేట 8 8

5 భిక్కనూరు 15 15

6 రాజంపేట 9 9

7 తాడ్వాయి 10 10

8 కామారెడ్డి 57 57

9 సదాశివనగర్‌ 13 13

10 గాంధారి 16 16

11 లింగంపేట 15 15

12 నాగిరెడ్డిపేట 10 10

13 ఎల్లారెడ్డి 22 22

14 బాన్సువాడ 32 32

15 బీర్కూర్‌ 8 8

16 నస్రూల్లాబాద్‌ 9 9

17 నిజాంసాగర్‌ 12 12

18 పిట్లం 14 14

19 పెద్దకొడప్‌గల్‌ 7 7

20 మద్నూర్‌ 18 18

21 జుక్కల్‌ 16 16

22 బిచ్కుంద 15 15

Updated Date - 2020-10-10T09:31:21+05:30 IST