వంద శాతం వ్యాక్సినేషన పూర్తి చేయాలి: కమిషనర్‌

ABN , First Publish Date - 2021-06-20T06:45:23+05:30 IST

కొవిడ్‌ వాక్సినేషన కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పేర్కొన్నారు.

వంద శాతం వ్యాక్సినేషన పూర్తి చేయాలి: కమిషనర్‌
పామిడిలో అధికారులతో మాట్లాడుతున్న నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు

గుత్తి, జూన 19: కొవిడ్‌ వాక్సినేషన కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం ఐసీడీఎస్‌, సచివాలయ అడ్మిన్లు, హెల్త్‌ కార్యదర్శులతో వాక్సినేషన, ఫీవర్‌ సర్వేపై ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల్లోని ప్రతి ఐదేళ్లులోపు పిల్లల తల్లులకు  కొవిడ్‌ వ్యాక్సిన వేయించాలన్నారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లులను గుర్తించి వ్యాక్సిన వేయించాలన్నారు. ఫీవర్‌ సర్వే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమం లో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగేశ్వరి, సచివాలయ క్లర్క్‌ ఇమామ్‌ హుసేన, టీపీఓ నరేష్‌, సీడీపీఓ నాగమణి, ఏఎనఎంలు పాల్గొన్నారు. 


పామిడి : మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కొవిడ్‌ వ్యాక్సిన వేయాలని నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శనివారం ఆ యన అధికారులతో చర్చించారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వలంటీర్లు, అంగనవాడీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టి విజయవంతం చే యాలని ఆదేశించారు. వ్యాక్సినేషనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నా రు. సమావేశంలో తహసీల్దారు సునీతబాయి, డిప్యూటీ తహసీల్దారు ఉద య్‌ భాస్కర్‌,  ఎంపీడీఓ శంకరప్ప, ఈఓఆర్డీ శశికళ పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: పట్టణంలోని ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల తల్లుల కు ఆదివారం ప్రత్యేక కొవిడ్‌ వాక్సినేషన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, అర్బన హెల్త్‌ సెంటర్లలో వాక్సినేషన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగంం చే సుకోవాలన్నారు. కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు.


గుత్తి రూరల్‌ :  ఐదేళ్ల వయసున్న పిల్లల తల్లులకు ఆదివారం ప్రత్యేక కొవిడ్‌ వాక్సినేషన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించా రు. మండలంలోని సచివాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, హెల్త్‌ సెంటర్లలో వాక్సినేషన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దారు హాజీవలి, ఎంపీడీఓ శ్రీ నివాసులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


రాయదుర్గం టౌన : 0-5 సంవత్సరాలు పిల్లలున్న తల్లులకు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆదేశించారు. పురపాల క సంఘం కార్యాలయ ఆవరణలో శనివారం వార్డు అడ్మిన, హెల్త్‌, మహి ళా పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆదివారం మెగా కొవిడ్‌ వ్యాక్సినేషన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా సచివాలయాల పరిధిలోని పిల్లల తల్లులకు సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది అవగాహన కల్పించి వ్యాక్సిన వేసుకునే విధంగా చైతన్య పరచాలని కోరా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన పొరాళ్లు శిల్ప, వైస్‌చైర్మన శ్రీనివాస యాదవ్‌, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, వైద్యాధికారి నజరీన, మున్సిపల్‌ మే నేజర్‌ ఖాదర్‌ మోహిద్దీన, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : మండలంలో 0-5 సంవత్సరాలలోపు పిల్లల త ల్లులకు కొవిడ్‌ టీకా వేయించాలని తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఎనఎంలు, అంగనవాడీ వర్కర్లు, ఆశాలకు ఆవులదట్ల పీహెచసీ ఇనచార్జి వైద్యులు రమేష్‌ ఆధ్వర్యంలో స మావేశం నిర్వహించారు. 14 పంచాయతీల్లో ఎనిమిది మంది ఏఎనఎంల ఆధ్వర్యంలో వెయ్యి మంది తల్లులకు టీకాలు అందించేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మండలంలో 2,286 మంది చిన్నారుల తల్లు లు వున్నట్లు గుర్తించామన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ పాతక్క, ఏ ఎనఎంలు ఆదిలక్ష్మీ, కొల్లమ్మ, పార్వతి, మారుతేశ్వరి పాల్గొన్నారు. 


తాడిపత్రి టౌన: పట్టణంలోని సచివాలయాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు కొవిడ్‌ వ్యాక్సినేషన కార్యక్రమం చేపట్టామని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 0-5 సంవత్సరాల పిల్లల తల్లులకు మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన ఇవ్వనున్నామన్నారు. 45సంవత్సరాలు వయస్సు దాటినవారికి, మొదటిడోసు వేయించుకొని 84 రోజులు పూర్తయిన వారికి రెండవ డోసు ఇస్తున్నామన్నారు.  


కూడేరు : మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం ఐదేళ్లలోపు పిల్ల ల తల్లులకు కరోనా టీకా వేస్తున్నట్లు ఇనచార్జి తహసీల్దార్‌ కుమారస్వామి తెలిపారు. గ్రామాల్లో దండోరా వేయిస్తామన్నారు.

Updated Date - 2021-06-20T06:45:23+05:30 IST