పెద్దవడుగూరు, మార్చి 2: మండలంలోని కిష్టిపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి (35) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తె లిపిన వివరాలివి. గంగాధర్‌రెడ్డి, చెన్నారెడ్డిలు ఆకుతోటలో కూలీ పని చేసేందుకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా, తాడిపత్రి నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ప్రమాదంలో గంగాధర్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన చెన్నారెడ్డిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వై ద్యం కోసం అనంతపురం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.