Baramullaలో వైన్ షాపుపై ఉగ్రవాది దాడి...ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-05-18T12:44:10+05:30 IST

జమ్మూకశ్మీరులోని బారాముల్లాలో కొత్తగా తెరిచిన వైన్ షాపుపై గుర్తుతెలియని ఉగ్రవాది గ్రెనెడ్‌తో దాడి చేశారు....

Baramullaలో వైన్ షాపుపై ఉగ్రవాది దాడి...ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

బారాముల్లా: జమ్మూకశ్మీరులోని బారాముల్లాలో కొత్తగా తెరిచిన వైన్ షాపుపై గుర్తుతెలియని ఉగ్రవాది గ్రెనెడ్‌తో దాడి చేశారు.మంగళవారం రాత్రి జరిగిన ఈ ఉగ్రదాడిలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడు రాజౌరి నివాసి రంజిత్ సింగ్‌గా గుర్తించారు.35 ఏళ్ల మృతుడు గార్ల పట్టణంలో కొత్తగా ప్రారంభించిన వైన్ షాపులో పనిచేస్తున్నాడు.గాయపడిన వారందరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన ఇతర ఉద్యోగులను గోవర్ధన్ సింగ్, రవి కుమార్ లుగా గుర్తించారు. వీరందరూ బిల్లవర్ కథువా నివాసితులు.దాడి తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన షాడో సంస్థ, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రెనెడ్ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.


‘‘బారాముల్లాలోని దేవాన్ బాగ్ వద్ద జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రంజిత్ సింగ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ దారుణమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి’’ అని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. గురువారం కశ్మీరీ పండిట్ ఉద్యోగులపై దాడి తర్వాత లోయలో జరిగిన రెండో అతిపెద్ద దాడి ఇది. అప్పటి నుంచి 4వేల మంది పండిట్ ఉద్యోగులు తమను కశ్మీర్ లోయ వెలుపల సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.


Updated Date - 2022-05-18T12:44:10+05:30 IST