Indian Embassy: కువైత్‌లో కరోనాతో చనిపోతే.. రూ. లక్ష పరిహారం

ABN , First Publish Date - 2021-07-29T16:35:20+05:30 IST

కువైత్‌లోని భారత ఎంబసీ కరోనా సంక్షోభ సమయంలో ప్రవాసులను ఆదుకునే దిశగా కీలక ప్రకటన చేసింది. కువైత్‌లో కరోనాతో చనిపోయిన భారత ప్రవాసులకు పరిహారం రూపంలో రూ. లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేవలం అల్పాదాయ వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎంబసీ ఆధ్వర్యంలోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్..

Indian Embassy: కువైత్‌లో కరోనాతో చనిపోతే.. రూ. లక్ష పరిహారం

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత ఎంబసీ కరోనా సంక్షోభ సమయంలో ప్రవాసులను ఆదుకునే దిశగా కీలక ప్రకటన చేసింది. కువైత్‌లో కరోనాతో చనిపోయిన భారత ప్రవాసులకు పరిహారం రూపంలో రూ. లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేవలం అల్పాదాయ వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎంబసీ ఆధ్వర్యంలోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూపు(ఐసీఎస్‌జీ) సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ మేరకు బుధవారం(జులై 28, బుధవారం) జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భారత రాయబారి సిబి జార్జి ప్రకటించారు. 120 కువైటీ దినార్ల కంటే తక్కువ సాలరీ గల ఏ భారత ప్రవాసుడైన మహమ్మారితో చనిపోతే వారు ఈ పరిహారం పొందెందుకు అర్హులని రాయబారి వెల్లడించారు.


కాగా, ఇప్పటివరకు కువైత్‌లో 540 మంది భారతీయులు కరోనాతో చనిపోయారు. వీరిలో వంద మంది కంటే ఎక్కువ 120 కేడీల కంటే తక్కువ జీతం గలవారేనని సమాచారం. రాయబారి సిబి జార్జి మాట్లాడుతూ.. లక్ష రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదని తెలుసు, కానీ మృతుల కుటుంబానికి ఇది ఏదో ఒక రకంగా సహాయపడుతుందని అన్నారు. అర్హులైన వారిని ఎంబసీ అధికారులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ఈ నగదు అందజేయస్తారని అంబాసిడర్ తెలిపారు.     

Updated Date - 2021-07-29T16:35:20+05:30 IST