Advertisement

కాటేసిన రాకాసి అల.. సముద్రంలో బోటు బోల్తా.. మత్స్యకారుడి మృతి

Aug 1 2020 @ 16:30PM

మరో నలుగురు క్షేమం.. బందరువానిపేటలో విషాదం


గార/సంతబొమ్మాళి(శ్రీకాకుళం జిల్లా): ఎంతో ఆశతో సముద్రంలోకి వేటకు వెళ్లిన ఆ యువకుడిని రాకాసి అల కాటేసింది. అలల ఉధృతికి బోటు బోల్తాపడడంతో మృత్యువాతపడ్డాడు. మత్స్య సంపదతో తిరిగి వస్తాడ నుకున్న కుమారుడు శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.   స్థానికులు, మెరైన్‌ పోలీసుల వివరాల ప్రకారం... గార మండలం బందరువానిపేటకు చెందిన పుక్కళ్ల గణేష్‌ (25)తో పాటు మరో నలుగురు మత్స్యకారులు శుక్రవారం వేకువజామున పడవపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. సగం దూరం వెళ్లేసరికి అలల ఉధృతి కారణంగా పడవ బోల్తా పడింది. దీంతో గణేష్‌ గల్లంతయ్యాడు. మిగిలిన నలుగురు ఈదుకుంటూ అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. గణేష్‌ మాత్రం తీరానికి చేరుకోకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.


సమాచారం తెలిసిన వెంటనే మెరైన్‌ సీఐ గోవిందరావు,  సిబ్బంది, ఎఫ్‌డీవో బి.సురేష్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి గుత్తు రాజారావు, తహసీల్దార్‌ జెన్ని రామారావు, తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో గణేష్‌ మృతదేహం శుక్రవారం సాయంత్రం సంతబొమ్మాళి మండలం ఉమ్మిలాడ సముద్ర తీరానికి చేరింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సంతబొమ్మాళి ఎస్‌ఐ వి.కామేశ్వరరావు  తెలిపారు. కాగా,  చేతికందివచ్చిన కొడుకు మృతి చెందడంతో  కుటుంబ సభ్యులు బో రుమంటున్నారు. గణేష్‌కు తల్లిదండ్రులతోపాటు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.  ఆయన మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్‌ గుంతు లక్ష్మయ్య కోరారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.