
భువనేశ్వర్: ఒడిశాలోని చిలికా సరస్సులో పర్యాటకులతో కూడిన పడవ బోల్తా పడటంతో ఒకరు గల్లంతు అయ్యారు. పడవలో ఉన్న మరో 10 మందిని రక్షించారు.ఇప్పటికీ ఒక వ్యక్తి జాడ కనిపించలేదు.Odishaలోని చిలికా సరస్సులో గురువారం మధ్యాహ్నం పడవ capsizesతో ఒకరు గల్లంతయ్యారు. బాలాసోర్ జిల్లాలోని రెమునా బ్లాక్ నుంచి 11 మంది పర్యాటకులు boat ఎక్కారు.చిలికా సరస్సులోని ఒక ద్వీపంలో ఉన్న కాళీజై దేవాలయం నుంచి బలుగావ్‌కు పర్యాటకులు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడింది. పర్యాటకులందరూ నీటిలో తేలుతున్నారు.అందరూ లైఫ్ జాకెట్లు ధరించడంతో పర్యాటకులెవరూ గాయపడలేదు.యాదృచ్ఛికంగా బాలుగావ్ పోలీసు అధికారులు సమీపంలోని ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు.
దీంతో సరస్సులో చిక్కుకుపోయిన పర్యాటకులను గుర్తించిన పోలీసులు 10 మందిని రక్షించి చికిత్స కోసం బాలుగావ్ ఆసుపత్రికి తరలించారు.పర్యాటకులందరూ ప్రస్తుతం కోలుకుంటున్నారని అధికారులు చెప్పారు.అయితే ఒకరి జాడ తెలియలేదు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి