మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్య లీక్స్ ఎక్కువవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. కీలక సన్నివేశాల్లో చిరు, చరణ్ కనిపించే గెటప్స్ తెలిపే పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. రీసెంట్‌గానే చరణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లుగా వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ 'ఆచార్య' షూటింగ్ ముగించుకుని వెళుతున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. చిరు, చరణ్‌లు ఈ సినిమాలో నక్సలైట్స్‌గా కనిపిస్తారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా లీకైన పిక్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి లీక్స్ ఎక్కువవుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే లీక్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా హీరోయిన్ పూజా హెగ్డే.. తాజాగా ఓ ఫొటోని లీక్ చేసింది. ఆ ఫొటో కూడా వైరల్ అయింది. ఇవి కాక షూటింగ్ స్పాట్‌కి చెందిన మరికొన్ని ఫొటోలు కూడా లీకైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిక్. దర్శకుడు కొరటాల శివ విడుదల వరకు దాచాలని.. ప్రేక్షకులను చివరి నిమిషంలో థ్రిల్ చేయాలని ప్లాన్ చేసినవన్నీ.. ఇలా ముందే లీక్ అయిపోవడంతో.. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ లీక్స్‌పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.