ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు

ABN , First Publish Date - 2022-05-20T07:15:46+05:30 IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండలం లోని ఇరసలగుండం, బచ్చలకురపాడు గ్రామాలలో గురువారం మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పర్యటించారు.

ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు
ఎమ్మెల్యేకు సమస్యలు వివరిస్తున్న ప్రజలు


మన ప్రభుత్వంలో గడప గడపన సమస్యలే

కొనకనమిట్ల, మే 19 : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండలం లోని ఇరసలగుండం, బచ్చలకురపాడు గ్రామాలలో గురువారం మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తాగునీరు, ఇళ్ల స్థలాలు, విద్యుత్‌ పలురకాల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇరసలగుండం గ్రామంలో తమకు తాగునీరు బోర్లలో సరిపడా రావడం లేదని గ్రామస్థులు కోరారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని బచ్చలకురపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు కోరారు. దీంతో ఆయన స్పందిస్తూ మీ గ్రామంలో 20 మంది సరిపడా ఇళ్ల స్థలాలు ఉన్నాయని వాటిని ఇప్పించే విదంగా చర్యలు తీసకుంటా అన్నారు. మెట్టువారిపల్లి గ్రామంలో రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు మరామత్ములకు గురయినప్పుడు సకాలంలో అధికారులు స్పందించడం లేదని ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్‌ అధికారులతో మాట్లాడి వెంటనే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు త్వరితగతిన రైతులకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బచ్చలకురపాడు ఎస్సీ కాలనీలో కొన్ని వీధులకు సీసీరోడ్లు మంజూరు చేయించాలని కాలనీవాసులు ఎమ్మేల్యేను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మెట్టు రవణమ్మ, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు ఏడుకొండలు, మండల ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటరెడ్డి, సొసైటి అధ్యక్షుడు కామసాని వెంకటేశ్వరెడ్డి, వైసీపీ నాయకులు వరికూటి రమణారెడ్డి పలువురు ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T07:15:46+05:30 IST