వన్‌ ప్లస్‌ వాచ్‌ అమ్మకాలు షురూ

ABN , First Publish Date - 2021-04-24T07:22:59+05:30 IST

ఆకట్టుకునే డిజైన్లతో వాచీ అమ్మకాలకు వన్‌ ప్లస్‌ సన్నద్ధమైంది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ వాచీకి సంబంధించిన మరిన్ని వివరాలు..

వన్‌ ప్లస్‌ వాచ్‌ అమ్మకాలు షురూ

ఆకట్టుకునే డిజైన్లతో వాచీ అమ్మకాలకు వన్‌ ప్లస్‌ సన్నద్ధమైంది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ వాచీకి సంబంధించిన మరిన్ని వివరాలు...


- ఒకే ఒక ఆప్షన్‌ ‘క్లాసిక్‌ ఎడిషన్‌’తో మార్కెట్లోకి వచ్చింది. దీని రేటు రూ.16,999. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్‌ కింద రేటు తగ్గించింది. రూ.14,999 కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.  

- ఎస్‌బీఐ కార్డుతో చెల్లింపు జరిపితే వెనువెంటనే రూ.2000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈఎంఐ లావాదేవీలకు ఆస్కారం ఉంది. ఎంపిక చేసిన కొన్ని ఎక్స్‌ప్రెస్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 50 శాతం వరకు కూడా డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతకుమించి కట్టలకొద్దీ ఆఫర్లు ఏమీ లేవు.

- మిడ్‌నైట్‌ బ్లాక్‌, మూన్‌లైట్‌ సిల్వర్‌ రంగుల్లో ఈ వాచీ లభిస్తోంది. ఫ్లోరోలాస్టోమర్‌(ఫ్లోరోకార్బన్‌ ఆధారిత సింథటిక్‌ రబ్బర్‌ - దీనికి అత్యధిక వేడిని తట్టుకునే లక్షణం ఉంటుంది) స్ట్రాప్‌ ఉంది. 


- రౌండ్‌ డయల్‌తో రెగ్యులర్‌ వాచీల మాదిరిగానే ఉంటుంది. హ్యాండ్‌ పాలిష్‌తో కేస్‌ సైడ్స్‌ నునుపుగా ఉంటాయి. 46 మి.మీ. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కేసుకు తోడు పైన కనిపించేలా 2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్‌ ఉంటుంది. 

- 1.35 అమ్మోల్డ్‌ డిస్‌ప్లే, 454 ్ఠ 454 పిక్సల్‌ రిజల్యూషన్‌ కాగా పైన స్ర్కాచ్‌(పగుళ్ళు)కి అవకాశం లేకుండా స్ర్కీన్‌ షెపైర్‌(నీలం రంగు రాయి) గ్లాస్‌ కోటింగ్‌ ఉంది. 

-  ఈ స్మార్ట్‌ వాచీ  అమేజ్‌ఫిట్‌ మాదిరిగా రియల్‌ టైమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పద్ధతిలో పనిచేస్తుంది. వేర్‌ ఓఎస్‌ ఆధారంగా కాదు. చాంపియన్‌ యాప్‌తో పనిచేస్తుంది. ఆ కారణంగా వినియోగదారులు తమ మొబైల్‌కు దీన్ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. అంటే పరిమితంగా యాప్‌లను, ఫేస్‌లను ఈ వాచీతో ఉపయోగించుకోవచ్చు. 

- ఈ వాచీలో కీలకమైన ఫీచర్‌ ఫిట్‌నెస్‌. ఇన్‌బిల్ట్‌ జీపీఎస్‌, 110 వరకు వర్కౌట్‌ మోడ్స్‌తో వస్తోంది. జాగింగ్‌, రన్నింగ్‌ కోసం ఆటోమేటిక్‌ వర్కౌట్‌ డిటెక్షన్‌ ఉంది. స్లీప్‌, స్ట్రెస్‌, ఆక్సిజన్‌ లెవెల్‌, హార్ట్‌ రేట్‌ని ఈ వాచీ మానిటర్‌ చేస్తుంది. 

- వన్‌ ప్లస్‌ టీవీని ఈ వాచీతో కనెక్ట్‌ చేసుకోవచ్చు. రిమోట్‌ మాదిరిగా దీన్ని ఉపయోగించవచ్చు. ఈలోపు పడుకుంటే ఆటోమేటిక్‌గా టీవీ ఆఫ్‌ అయ్యే సౌలభ్యం కూడా ఉంది. 

- ఐపి69 రేటింగ్‌ ఇచ్చారు. ఇది వాటర్‌ రెసిస్టెంట్‌ కూడా. 

- 402 ఎంఎహెచ్‌ బ్యాటరీ సపోర్ట్‌ ఉంది. సింగిల్‌ ఫుల్‌ చార్జింగ్‌తో రెండు వారాలు గడిపేయవచ్చు. వినియోగాన్ని అనుసరించి బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది.  ఆ కారణంగా రెగ్యులర్‌ యూజర్లకు ఒక వారం వరకు వస్తుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. అయిదు నిమిషాల సేపు ఛార్జింగ్‌ చేస్తే రోజంతా సరిపోతుందని అంటున్నారు. 

- ఈ స్మార్ట్‌వాచీ క్లాసిక్‌ ఎడిషన్‌కు తోడు కోబాల్ట్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను కూడా వన్‌ ప్లస్‌ విడుదల చేస్తోంది. కోబాల్ట్‌ మిశ్రమంతో దీన్ని రూపొందించారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు హార్డ్‌. బయటి ప్రభావాలతో తినేసే లక్షణాలను తట్టుకునే శక్తి కూడా ఈ మిశ్రమానికి ఉంది. క్లాసిక్‌ ఎడిషన్‌ మాదిరిగానే స్ర్కాచ్‌ రెసిస్టెన్స్‌ ఉంది. వేగాన్‌ లెదర్‌ స్ట్రాప్‌, బట్టర్‌ఫ్లయ్‌ బకెల్‌ ఉన్నాయి. అయితే దీని రేటును మాత్రం కంపెనీ ఇంకా బయటపెట్టలేదు.

Updated Date - 2021-04-24T07:22:59+05:30 IST