Jio 5G phone: జియో 5జీ ఫోన్ ధర ఇంతేనట ?.. కీలక రిపోర్ట్ ఏం చెబుతుందంటే...

ABN , First Publish Date - 2022-09-27T21:33:22+05:30 IST

రిలయన్స్ జియో (Reliance Jio) 5జీ ఫోన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫోన్‌ ధరకు సంబంధించిన వివరాలేవీ ఇప్పటివరకు వెల్లడికాలేదు.

Jio 5G phone: జియో 5జీ ఫోన్ ధర ఇంతేనట ?.. కీలక రిపోర్ట్ ఏం చెబుతుందంటే...

రిలయన్స్ జియో (Reliance Jio) 5జీ ఫోన్ కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఫోన్‌ ధరకు సంబంధించిన వివరాలేవీ ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే జియో 5జీ ఫోన్ ధర రూ.8 వేల నుంచి రూ.12 వేల కంటే తక్కువగానే ఉండనుందని డేటా అనలిటిక్స్ సంస్థ ‘కౌంటర్‌పాయింట్’ (Counter point) రిపోర్టు పేర్కొంది. అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి రిపోర్ట్‌ని తొలగించినప్పటికీ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఒరిజినల్ రిపోర్టుని ప్రస్తావిస్తూ.. జియో 5జీ ఫోన్ ధర రూ.8,000 నుంచి రూ.12,000 మధ్య ఉండొచ్చని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. 2024లో ఏదో ఒక సమయంలో సరసమైన ధరకే 5జీ ఎంఎంవేవ్+ సబ్-6జీహెచ్‌జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి  విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఫోన్ ధర బీవోఎమ్ (BoM) (బిల్ ఆఫ్ మెటిరియల్స్)ను బట్టి ఉండొచ్చని తెలిపింది.


కాగా ఈ రిపోర్టులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ రూ.12 వేల లోపు అందిస్తే భారత్‌లో తక్కువ ధరకే 5జీ ఫోన్లు అందిస్తున్న కంపెనీల జాబితాలో రిలయన్స్ జియో నిలవనుంది. కాగా ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉండొచ్చంటూ గతంలో ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. వాస్తవానికి గత నెల్లో జరిగిన రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో 5జీ ఫోన్‌ని ఆవిష్కరిస్తారనే అంచనాలున్నాయి. అయితే 5జీ ప్రణాళికలు వివరాలు, జియో ఎయిర్ ఫైబర్ 5జీ హాట్‌స్పాట్‌ను రిలయన్స్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.


5జీ ఫోన్ ప్రత్యేకతలివే..

5జీ ఫోన్‌ని ఆవిష్కరించకపోయినప్పటికీ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లపై కొన్ని అంచనాలున్నాయి. హెచ్‌డీ+ క్వాలిటీతో 6.5 - ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్‌తో అందుబాటులోకి రానుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో ఫోన్ లభించనుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్, 4జీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌టెండబుల్ స్టోరేజీ‌తో రానుంది. జియోఫోన్ నెక్స్ట్ మాదిరిగానే జియో 5జీ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతిఓఎస్‌పై పనిచేసే అవకాశం ఉంది. జియో యాప్స్‌తోపాటు జీమెయిల్, మీట్ వంటి  గూగుల్ ఇన్-హౌస్ యాప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. 13 - మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఒక 2- మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఫోన్‌కు సంబంధించిన ఇప్పటివరకు తెలిసిన వివరాలు ఇవే. 

Updated Date - 2022-09-27T21:33:22+05:30 IST