రూపాయి నాణెంలో 700 రూపాయల వెండి.. వివరాలు తెలుసుకుంటారా?

ABN , First Publish Date - 2022-02-15T16:18:45+05:30 IST

దేశంలో ఒక రూపాయి నోటు ఇతర నోట్ల కంటే..

రూపాయి నాణెంలో 700 రూపాయల వెండి.. వివరాలు తెలుసుకుంటారా?

దేశంలో ఒక రూపాయి నోటు ఇతర నోట్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ నోటు 100 సంవత్సరాలకు పైగా చలామణిలో ఉంది. అలాగే ఒక రూపాయి నాణెం అంత విలువను కలిగి ఉండనప్పటికీ ఒకానొకప్పుడు దానికి చాలా విలువ ఉండేది. అవును.. గతంలో ఒక రూపాయి నాణెంలో వెండి ఉండేది. ఫలితంగా దాని విలువ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో ఆ నాణేన్ని బంగారం-వెండి వ్యాపారికి విక్రయిస్తే.. దాని విలువకు రెండితలుగా డబ్బు ఇచ్చేవాడు. ఇదేవిధంగా ఒక రూపాయి నోటుకు సంబంధించి కూడా ఆసక్తికర విషయాలున్నాయి. ఇంతకు ముందు ఒక రూపాయి నాణెంలో వెండి మొత్తం చాలా ఎక్కువగా ఉండేది. హిందూస్థాన్ టైమ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో భారతదేశంలోని ఒక రూపాయి నాణెంలో 10.7 గ్రాముల వెండి ఉండేది. అనంతరం ఈ నాణేలకు బదులుగా కాగితం నోట్లు ముద్రిత మయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయుధాలను తయారు చేయడానికి ఆ నాణేలను ఉపయోగించారని కూడా చెబుతారు. 



ఆ నాణెంలోని వెండి విలువ ఈనాటి లెక్కల ప్రకారం చూస్తే 700 రూపాయల వరకూ ఉంది. 1917 నవంబరు 30న తొలిసారిగా ఒక రూపాయి నోటును విడుదల  చేశారు. ఇంతకుముందు ఈ నోటు భారతదేశంలో కాకుండా ఇంగ్లాండ్‌లో ముద్రితమయ్యేది. ఇది తెలుపు రంగులో ఉండేది. దీని తరువాత, ఇందులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి ఈ నోటు 100 సంవత్సరాల కాలంలో 125 సార్లు మార్పులను సంతరించుకుంది. నేటికి ఈ నోటుకు 104 ఏళ్లు దాటింది. ఈ నోటు ఇప్పటికీ చెలామణిలో ఉంది. అయితే 1926లో తొలిసారిగా ఒక రూపాయి నోట్లను విడుదల చేయడం ఆపివేశారు. 1940లో మళ్లీ ఒక్క రూపాయి నోటు మార్కెట్‌లోకి వచ్చింది. అది 1994 వరకు కొనసాగింది. 1994లో భారత ప్రభుత్వం వాటిని జారీని నిలిపివేసింది. ఈ నిషేధం 2014 వరకు కొనసాగింది. 1 జనవరి 2015 నుండి ఒక రూపాయి నోటు ముద్రణ మళ్లీ ప్రారంభమైంది. ఒక రూపాయి నోటు తప్ప మిగిలిన అన్ని నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ముద్రితమవుతాయి. ఒక రూపాయి నోటును భారత ప్రభుత్వం ముద్రిస్తుంది. దీనిపై ఆర్‌బిఐ గవర్నర్ సంతకం కాకుండా.. ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. అయితే ఒక రూపాయి నోటు పంపిణీ బాధ్యత ఆర్‌బీఐపైనే ఉండటం గమనార్హం. 

Updated Date - 2022-02-15T16:18:45+05:30 IST