హైదరాబాద్ : ఒక పక్క పెళ్లి... మరోపక్క వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-06-17T19:51:02+05:30 IST

వ్యాక్సిన్‌ కేంద్రంలో కోవాగ్జిన్‌ డోస్‌ వేయటంతో ...

హైదరాబాద్ : ఒక పక్క పెళ్లి... మరోపక్క వ్యాక్సిన్‌

హైదరాబాద్ సిటీ/బౌద్ధనగర్‌ : సీతాఫల్‌మండి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాలు వద్ద బుధవారం జనజాతర తలపించింది. ఒకపక్క టీకా వేయించుకోవటానికి, మరోపక్క పెళ్లివేడుకకు అధికసంఖ్యలో హాజరు కావటంతో ఈ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నాం రెండుగంటల వరకు ఈ ప్రాంగణంలో ఎటువంటి భౌతిక దూరం పాటించకుండా సుమారు మూడువేల మంది ఉన్నట్లు అంచనా వేశారు. మంగళవారం నుంచి వ్యాక్సిన్‌ కేంద్రంలో కోవాగ్జిన్‌ డోస్‌ వేయటంతో బుధవారం ఉదయం భారీ సంఖ్యలో సూపర్‌స్పైడర్స్‌ చేరుకున్నారు. దీంతోపాటు మాణికేశ్వరినగర్‌ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడి కుమార్తె వివాహన్ని లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కన పెట్టి వ్యాక్సిన్‌ కేంద్రానికి అనుకుని ఉన్నా మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు సుమారు పదిహేను వందల మంది హాజరైనట్లు సమాచారం.


సర్వర్లు డౌన్‌... వ్యాక్సిన్‌ ప్రక్రియ ఆలస్యం...

సీతాఫల్‌మండి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ ప్రక్రియ ఆలస్యంగా సాగింది. సర్వర్‌ డౌన్‌ కావటంతో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాటు చేసిన కంపూటర్స్‌లో నమోదు చేయటానికి చాలా సమయం పట్టింది. దీంతో సూపర్‌స్పైడర్లు గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డారు. బుధవారం 1843మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు సికింద్రాబాద్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ పల్లె మోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-06-17T19:51:02+05:30 IST