వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-05-20T05:50:05+05:30 IST

వాణిజ్య పన్నుల శాఖ బకాయి దా రులకు ప్రత్యేక ఆఫర్‌ ఇస్తోంది. కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు న్న వ్యాపారులకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి అవకాశాన్ని క ల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌
జగిత్యాల జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం

- వాణిజ్య పన్నుల శాఖలో బకాయిదారులకు అవకాశం

- తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఈనెల 16 నుంచి జూన్‌ 30వరకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలో 200 మందికి పైగా సమాచార నోటీసులు

జగిత్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖ బకాయి దా రులకు ప్రత్యేక ఆఫర్‌ ఇస్తోంది. కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు న్న వ్యాపారులకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి అవకాశాన్ని క ల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు లు జారీ చేసింది. జిల్లాలో సుమారు రూ. 10 కోట్లు బకాయిల వసూళ్ల లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. 

 పేరుకుపోయిన పన్ను బకాయిలు...

జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు ఇప్పటివరకు రూ. కోట్ల బకాయిలు ఉండగా తాజాగా ఆ బకాయిల వసూళ్లే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించింది. మామూలుగా అయితే పన్నులు కట్టేందుకు వ్యాపారులు పెద్దగా ముందుకు రారు. వీలైతే పన్నులు చెల్లిం చకుండా, జీరో వ్యాపారం చేసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తుం టారు. ఇలాంటి వ్యాపారుల నుంచి మొండి బకాయిలు వసూలు చేసేందుకు ఈ రాయితీ పథకాన్ని తీసుకొచ్చింది. జగిత్యాల జిల్లాలో సుమారు దశాబ్ధ కాలంగా సుమారు రూ. 10 కోట్ల వరకు బకాయిలునున్నట్లు అంచనా ఉంది. 

స్పందన వస్తే భారీ ఆదాయమే....

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తే ప్ర భుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇందుకు సంబందించి మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. ఈ రాయితీ పథ కం జిల్లాలోని ఆయా వ్యాపారులకు ఊరట కలగనుంది. ఎలాంటి వివా దాలు లేని పన్ను బకాయిలపై అపరాద రుసుము, వడ్డీ లేకుండా రాయి తీలతో చెల్లించవచ్చు. ఇక వాణిజ్య పన్నులశాఖ సిబ్బంది సదరు మొండి బకాయిలు ఉన్న వ్యాపారులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 200 మంది వ్యాపారులకు వన్‌టైమ్‌ సెటి ల్‌మెంట్‌ సమాచారం అందిస్తూ నోటీసులు జారీ చేశారు.

రాయితీలు ఇలా...

ఏపీ జనరల్‌ సేల్స్‌టాక్స్‌ బకాయిల్లో 40 శాతం చెల్లిస్తే మిగిలిన 60 శాతం మాపీ చేస్తారు. వ్యాట్‌ టాక్స్‌ల చట్ట కింద ఉన్న బకాయిల్లో 50 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తం మాఫీ అవుతుంది. ఏటా పన్ను చెల్లింపు ను యూనిట్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఎంట్రీ బాక్స్‌ బకాయిల్లో 60శాతం చెల్లిస్తే మిగిలిన 40 శాతం మాఫీ అవుతుంది. 

వ్యాపారులకు ఊరట...

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌తో ప్రదానంగా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు పలు మండల కేంద్రా లు, మేజర్‌ పంచాయతీల్లో వివిధ వ్యాపారులు చేసుకుంటున్న వ్యక్తులకు ఊరట లభించనుంది. సిమెంట్‌, బంగారు, వస్త్ర, ఇండస్ట్రీ, మిల్లర్లు, ఎలకా్ట్ర నిక్స్‌, ఆయా కంపెనీల డీలర్లు తదితర వ్యాపారులు చేస్తున్న వ్యాపారు లకు కొంతమేరకు ఉపశమనం లభిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. జిల్లా లో దాదాపు 5 వేల మందికి పైగా వ్యాపారులు ఉన్నారు. ఇందులో చాల మంది ప్రభుత్వ పన్నులు చెల్లించకుండా వివిధ వ్యాపారాలు చేస్నున్నారు.

ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ...

ప్రభుత్వం కల్పించిన వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ఈనెల 16వ తేది నుంచి జూన్‌ 30వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూలై 1వ తేది నుంచి 15వ తేది వరకు వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. జూలై 16వ తేది నుంచి ఆగస్టు 15వ తేది వరకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చెల్లింపునకు అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్‌ విధా నంతో ఈ ప్రక్రియ అమలు చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలనకు ప్ర త్యేక కమిటీ నియమించి, బకాయిలు రూ. 15 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తమైతే నాలుగు వాయిదాలలో చెల్లించేందుకు వీలును కల్పించారు. అంతకంటే ఎక్కువ వాయిదాలు కావాలంటే బ్యాంకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

సద్వినియోగం చేసుకోవాలి

- గౌతమ్‌, జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారి

మొండి బకుయిల వసూలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలోని పలువురు వ్యాపారులకు సమాచారం నిమి నోటీసులు జారీ చేస్తున్నాము. వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా రూ. కోట్ల మేర ఆదాయం వ చ్చే అవకాశం ఉంది. బకాయిలు చెల్లించని వ్యాపారుల లైసెన్స్‌ రద్దుతో పాటు తగు చర్యలు తీసుకుంటాం. ఈ వన్‌టైం సెటిల్‌మెంట్‌ను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి.

 

Updated Date - 2022-05-20T05:50:05+05:30 IST