వన్‌ టైం సెటిల్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-08-08T06:34:00+05:30 IST

మున్సిపాలీటీల్లో నివాస గృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవ త్స రం బకాయి ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం 90 శాతం మినహాయింపు ఇచ్చింది.

వన్‌ టైం సెటిల్‌మెంట్‌

- బల్దియాల్లో ఆస్తి పన్ను చెల్లింపుపై 90 శాతం వడ్డీ మాఫీ

- అక్టోబర్‌ 31వరకు గడువు

- జిల్లాలో రూ. కోట్లలో బకాయిలు

జగిత్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలీటీల్లో నివాస గృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవ త్స రం బకాయి ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం 90 శాతం మినహాయింపు ఇచ్చింది. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలే లక్ష్యంగా ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వన్‌టైమ్‌ సెటిల్‌ మెంట్‌ స్కీం (ఓటీఎస్‌) ప్రకటించింది. నివాస గృహాలు, వాణిజ్య సము దాయ భవనాలకు సంబంధించి ఈ అవకాశం కల్పించారు. ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాపీ చేయనున్నట్లు మున్సిపల్‌ శాఖ ప్రకటించింది.

జగిత్యాల జిల్లాలో...

జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలున్నాయి. జగిత్యాల, కోరుట్ల, మె ట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో రూ. కోట్లలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో 64,428 గృహాలు, ఇతర ఆస్తులు న్నాయి. ఇందుకు గాను రూ. 2,305.82 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ. 620.74 లక్షలు వసూలు అయ్యాయి. జిల్లాలో 26.92 శాతం పన్ను వసూలైంది. వంద శాతం పన్ను వసూళ్లు జరిగేలా మున్సిపల్‌ ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్‌...

2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బకాయిలు ఉన్న వారికి ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని 90 శాతం తగ్గిస్తూ ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌ మెంట్‌ స్కీం) అమలులోకి తీసుకొస్తూ మున్సిపల్‌ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబరు 31తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఉన్న బకాయిలు 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించే అవకాశాన్ని కల్పించింది. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు పన్నుల రాబడి కలిసివచ్చే అవకాశాలున్నాయి.. దీంతో ఆస్తి పన్ను వసూళ్లపై మున్సిపల్‌ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 

డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం...

జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లకు సిబ్బంది పోటీ పడుతున్నారు. ఈ ఏడాది మున్సిపల్‌ శాఖ ఆన్‌లైన్‌ డిజిటల్‌ లావాదేవీ లకు శ్రీకారం చుడుతూ క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, వాట్సప్‌ నంబర్‌ తీసు కొచ్చింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ ద్వారా చెల్లిస్తే నేరుగా ఆయా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ వుతాయి. ముందు చెల్లించిన వారికి సర్దుబాటు ఆయా మున్సిపాలిటీల్లో 90 శాతం రాయితీకి అర్హులైన పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఈ మేరకు వీరంతా వందశాతం రాయితీ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ బకాయిలను పూర్తి వడ్డీతో ఈ ఏడా ది ఏప్రిల్‌1 నుంచి జూలై16 మద్యల చెల్లించి ఉంటే వారికీ ఓటీఎస్‌ వర్తిం పజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన వడ్డీలో 90 శాతా న్ని వెనక్కు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్‌ ఆస్తి పన్ను డిమాండ్‌లో సర్దుబాటు చేయనున్నారు. 2020 ఆగస్టులో కూడా ప్రభుత్వం ఇదే మాది రి వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మరోసారి ఈ పథకం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వందశాతం సద్వినియోగం చేసుకునేలా పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని కమీషన ర్లకు ఇప్పటికే ఆదేశాలందాయి. సెలవు దినాల్లో సైతం కార్యాలయాల్లో అందుబాటులో ఉండి పన్ను చెల్లింపు స్వీకరించాలని సూచించింది.

అందుబాటులోకి వాట్సప్‌ సేవలు

ప్రభుత్వ ఆదేశాలతో కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మిని స్ర్టేషన్‌ వారు ఆస్తి పన్ను చెల్లింపునకు వాట్టసప్‌ నంబర్‌ ను ఏర్పాటు చే శారు. ఈ నంబరుకు ఏ లేదా తెలుగు అని టైప్‌ చేసి పంపితే వివిధ ర కాల సేవలకు సంబంధించిన సమాచారం వస్తుంది. అందులో 1 నంబ రు టైప్‌ చేసి పంపిస్తే రిప్లయ్‌ వస్తుంది. పీటీఐఎన్‌ నంబర్‌ను ఉపయో గించి పన్ను చెల్లించవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

- అయాజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కోరుట్ల

ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంను బకాయి దారులు సద్వినియోగం చేసుకోవాలి. నివాస గృహలు, దుకాణ యజమా నులు 90 శాతం వడ్డీ మాఫీని చెల్లించి మున్సిపల్‌ అభివృద్ధికి సహకరిం చాలి. పన్ను పూర్తిగా డిజిటల్‌ విధానంలో చెల్లించవచ్చు. ఎవరి చేతికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.

Updated Date - 2022-08-08T06:34:00+05:30 IST