రియాద్: వలసదారులకు సౌదీ అరేబియా సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై మరింత సులువుగా ఉద్యోగ మార్పుకు అవకాశం కల్పించింది. ఒక యజమాని వద్ద కచ్చితంగా ఏడాదిపాటు పని చేయాలనే నిబంధనను సవరించింది. ఈ మేరకు కార్మిక చట్టానికి ప్రత్యేక సవరణలు చేసింది. కనుక ఇక నుంచి ప్రవాస కార్మికులు ఎప్పుడంటే అప్పుడు తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మారిపోవచ్చు. ప్రస్తుత యజమాని సమ్మతిలేకుండానే మరో ఉద్యోగానికి బదిలీ కావచ్చు. అయితే, ప్రవేట్ రంగానికి చెందిన కార్మికులు నితాఖత్ సౌదైజేషన్ ప్రొగ్రామ్‌లో నిర్ధేశించిన షరతులకు లోబడి ఉండాలి. ఉద్యోగ బదిలీ కోసం కార్మికులు తప్పనిసరిగా ప్రస్తుత యజమాని అనుమతి తీసుకోవాలని సౌదీ అధికారులు స్పష్టం చేశారు.