హోల్ పంచ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా.. వచ్చేసిన వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లు

ABN , First Publish Date - 2020-10-27T01:58:00+05:30 IST

వన్‌ప్లస్ నార్డ్ ఎన్ సిరీస్‌ నుంచి తొలి మోడల్స్ వచ్చేశాయి. ‘నార్డ్ ఎన్10 5జి’, ‘నార్డ్ ఎన్100’ ఫోన్లను లాంచ్ చేసింది. రెండు ఫోన్లు హోల్ పంచ్ డిస్‌ప్లే

హోల్ పంచ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా.. వచ్చేసిన వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లు

న్యూఢిల్లీ: వన్‌ప్లస్ నార్డ్ ఎన్ సిరీస్‌ నుంచి తొలి మోడల్స్ వచ్చేశాయి. ‘నార్డ్ ఎన్10 5జి’, ‘నార్డ్ ఎన్100’ ఫోన్లను లాంచ్ చేసింది. రెండు ఫోన్లు హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్‌ కలిగి చూడడానికి ‘వన్‌ప్లస్ 8టి’ని పోలి ఉన్నాయి. ‘నార్డ్ ఎన్ 10 5జి’  5జీ సపోర్ట్ చేయనుండగా, ‘నార్డ్ ఎన్ 100’ 4జీకి సపోర్ట్ చేస్తుంది. రెండింటిలోనూ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 


 వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జి 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. దాదాపు రూ. 32 వేలు కాగా, వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 100 4జీబీ ర్యామ్+64 జీబీ ఆప్షన్ ధర రూ. 17,300 మాత్రమే. ఈ రెండు ఫోన్లు తొలుత యూరప్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేసేదీ వన్‌ప్లస్ వెల్లడించలేదు. 


వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జి స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10.5, 6.45 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,90 హెచ్‌జడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 690 5జి ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. 128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 512 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. వెనకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 30టి ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 


వన్‌ప్లస్ నార్డ్ ఎన్100 స్పెసిఫికేషన్లు:  ఆక్సిజన్ ఓఎస్ 10.5, 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 60 హెచ్‌జడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా, 64 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్న ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 

Updated Date - 2020-10-27T01:58:00+05:30 IST