ఆర్‌ అండ్‌ డీ కోసం వన్‌ప్ల్‌స, ఒప్పో జట్టు

ABN , First Publish Date - 2021-01-23T06:18:28+05:30 IST

ఆర్‌ అండ్‌ డీ కోసం వన్‌ప్ల్‌స, ఒప్పో జట్టు

ఆర్‌ అండ్‌ డీ కోసం వన్‌ప్ల్‌స, ఒప్పో జట్టు

న్యూఢిల్లీ : భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు చైనా కంపెనీలు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని తమ పరిశోధన అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాల కార్యకలాపాల్ని ‘ఓప్లస్‌’ పేరుతో సమన్వయం చేయాలని స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు వన్‌ప్లస్‌, ఒప్పో నిర్ణయించాయి. ఈ సమన్వయం ద్వారా వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈ రెండు సంస్థల ఆర్‌ అండ్‌ డీ కేంద్రాల్లో 700 మంది పని చేస్తున్నారు. కాగా మార్కెట్లో మాత్రం రెండు కంపెనీలు విడివిడిగానే కార్యకలాపాలు సాగిస్తాయి. ఆర్‌ అండ్‌ డీ విభాగంలో కలిసి పనిచేయటం ద్వారా భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో సామ్‌సంగ్‌ వంటి కంపెనీలను ధీటుగా ఎదుర్కొవచ్చని భావిస్తున్నాయి. 

Updated Date - 2021-01-23T06:18:28+05:30 IST