వన్‌టౌన్‌లో దసరా ఉత్సవాలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-09-25T06:09:44+05:30 IST

వన్‌టౌన్‌ ప్రాం తంలోని పురాతన దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన చిట్టినగర్‌ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో దసరా మ హోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వన్‌టౌన్‌లో దసరా ఉత్సవాలకు సిద్ధం
విద్యుత్‌ కాంతులీనుతున్న కొత్తమ్మవారి ఆలయం

విద్యుద్దీపాలు, రంగులతో సుందరంగా రూపుదిద్దుకున్న ఆలయాలు

చిట్టినగర్‌, సెప్టెంబరు 24 : వన్‌టౌన్‌ ప్రాం తంలోని పురాతన దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన చిట్టినగర్‌ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో దసరా మ హోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రం గులు వేయించి, విద్యుత్‌ దీపాల ఏర్పాటు చేస్తున్నా రు. సెప్టెంబరు 26 నుంచి పది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమివ్వనుంది. సుమారు 150 ఏళ్లకు పూర్వం బ్రిటీష్‌ పాలన లో బెజవాడ పట్టణానికి పొలిమేర చిట్టడవి ప్రాంతం లో ఇక్కడ టోల్‌గేటు ఉండేది. ఆ కాలంలో మశూచి, ప్లేగు వంటి వ్యాధులు పట్టణ ప్రజలను పీడుస్తుంటే నివారణోపాయంగా అమ్మను కొలిచారు. అర్చనలు, నైవేథ్యాలు పెట్టారు. ఆ తల్లి చల్లని చూపువల్ల అంద రూ ఆయురారోగ్యాలు పొందారు. నాటి నగరాల పెద్ద లు ఈ మంగళమాతను ఆరాధించి అభీష్టసిద్ధిని పొం దారు. 1951 ఏప్రిల్‌ 1న మహాలక్ష్మీదేవికి, 1930లో గం గానమ్మకు ఆలయాలు నిర్మించి శ్రీ గంగానమ్మ, ము త్యాలమ్మ, పోతురాజు విగ్రహాలు ప్రతిష్ఠించారు. నాటి నుంచి గంగానమ్మ, ముత్యాలమ్మతో కొలువుదీరిన జనని తనను కొలిచినవారిని అనుగ్రహించి ఆశీర్వదిస్తోంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి అనాదిగా భక్తులకు అమ్మకాగా, చిట్టినగర్‌లో కొలువైన మహాలక్ష్మి కొత్తగా వెలసింది కనుక కొత్తమ్మవారిగా పూజలందుకుంటోంది. 26 నుంచి పది రోజుల పాటు గంగానమ్మ అమ్మవారు వివిధ అలంకారాలతో దర్శనమివ్వనుంది. 26న మంగళగౌరిదేవి అలంకారం, 27న బాలత్రీపురసుందరిదేవి, 28న గాయత్రిదేవి, 29న లలితాత్రిపురసుందరీదేవి, 30న అన్నపూర్ణదేవి, అక్టోబరు 1న మహాలక్ష్మిదేవి 2న సరస్వతీదేవి, 3న దుర్గాదేవి, 4న మహిషాసురమర్ధని దేవి, 5న రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 

పాలఫ్యాక్టరీ సమీపంలో..

పాలఫ్యాక్టరీ సమీపనం లోని విజయదుర్గా రామలింగేశ్వర, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి పది రోజులపాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శమివ్వనున్నారు. 26న విజయదుర్గాదేవిగా, 27న బాలాత్రిపురసుందరీదేవి, 28న గాయత్రీదేవి, 29న లలితాత్రిపురసుందరీదేవి, 30న అన్నపూర్ణాదేవి, అక్టోబరు 1న మహాలక్ష్మిదేవి, 2న సరస్వతిదేవి, 3న దుర్గాదేవి, 4న మహిషాసురమర్ధనీదేవి 5న రాజరాజేశ్వరిదేవిగా ద ర్శనమిస్తారు. ఉదయం 7.30 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు జరుగుతాయి. అక్టోబరు 5న పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

Updated Date - 2022-09-25T06:09:44+05:30 IST