హుండీల చోరీ నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2020-09-29T11:15:06+05:30 IST

దేవాలయాల్లో హుండీలను ప గులకొట్టి కానుకలను స్వా హా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు సోమవా రం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ కె.ప్రకాశరావు కేసు వివరాలను వెల్లడించారు.

హుండీల చోరీ నిందితుల అరెస్టు

 కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ

దర్శి, సెప్టెంబరు 28 : దేవాలయాల్లో హుండీలను ప గులకొట్టి కానుకలను స్వా హా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు సోమవా రం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ కె.ప్రకాశరావు కేసు వివరాలను వెల్లడించారు. అద్దంకికి చెందిన పి.భూపతి, టి.రామకృష్ణ తరచూ హుండీల చోరీలకు పాల్పడుతున్నారు.


అద్దంకి మండలం పార్వతీపురంలోని అంకమ్మ దేవాలయంలో గత మే నెల 31న రెండు హుండీలను పగులకొట్టి సు మారు రూ.5 వేల నగదును దొంగలించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆ దేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హుండీ దొంగలను సో మవారం అరెస్టు చేసినట్లు వివరించారు. వారు గతంలో బల్లికురవ, మద్దిపాడు గ్రామాల్లోని ఆలయాల్లో హుండీల చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు రికవరీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో దర్శి సీఐ మహమ్మద్‌ మొయిన్‌,  ఎస్సై వి.మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T11:15:06+05:30 IST